‘ఆ ఒక్కటి మినహా మూడు జిల్లాలు వెనకబడి ఉన్నాయి’ | Gudivada Amarnath: Except Visakha City Three Districts Are Not Developed | Sakshi
Sakshi News home page

‘ఆ ఒక్కటి మినహా మూడు జిల్లాలు వెనకబడి ఉన్నాయి’

Published Fri, Dec 20 2019 4:48 PM | Last Updated on Fri, Dec 20 2019 4:51 PM

Gudivada Amarnath: Except Visakha City Three Districts Are Not Developed - Sakshi

సాక్షి, విశాఖ :  విశాఖ సిటీ మినహాయిస్తే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. విశాఖకు రాజధాని వస్తే ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి బాటలో నడుస్తాయని అన్నారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసే దిశలో కమిటీ నివేదిక రావాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఉత్తరాంధ్ర విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. అమరావతి మాదిరిగా విశాఖలో ఇన్సైడ్ అవుట్ సైడ్ ట్రేడింగ్‌లు జరగవని, ఇక్కడ రాజధాని వస్తే ప్రజల జీవనం మెరుగుపడుతుందని అన్ని వర్గాలు ఆశిస్తున్నాయని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement