సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్ నాగిరెడ్డి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో.. ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ.. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన వద్దని.. ప్రభుత్వం తరఫున బ్యానర్లు పెట్టవద్దని సూచనలు చేశారు. అదే విధంగా రాజకీయ పార్టీలు సమావేశాలు పెట్టవద్దని సూచించారు.(మోగిన పుర నగారా.. పూర్తి వివరాలు)
ఇక మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత అభ్యర్థుల వ్యయం పరిగణనలోకి తీసుకుంటామని... డిపాజిట్ గతంలో ఉన్న విధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న కలెక్టర్లు, 28న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 1-1- 2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. పోలింగ్ కోసం బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని.. ఈమేరకు అధికారులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషనుకు 800 మంది ఓటర్లు ఉంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment