హైదరాబాద్ : ఎన్నికలు అనేవి అవినీతి అరికట్టడానికి తొలిమెట్టు అని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో నాగిరెడ్డి మాట్లాడుతూ... ప్రజల్లో అవినీతిపై చైతన్యరాహిత్యం ఉందని... అందువల్లే ఆ అంశాన్ని ముట్టుకోలేకపోతున్నామన్నారు.
ఎన్నికల్లోనే అవినీతి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రలోభాలకు గురికావద్దు అని ప్రజలకు ఈ సందర్భంగా నాగిరెడ్డి హితవుపలికారు. అలాగే ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రజలకు నాగిరెడ్డి సూచించారు.