
పెను సంక్షోభంలో ఏపీ రైతులు
ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసిపోతున్నా, ఇప్పటికీ లక్షలాది ఎకరాలు సాగుకు నోచుకోలేదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇంతవరకు రుణమాఫీ జరగలేదని, కనీసం రీషెడ్యూల్ కూడా అవ్వలేదని అన్నారు.
రైతులకు మీరు చేసే న్యాయం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. రైతులు పండగ చేసుకుంటున్నారని మంత్రులు అనడం దారుణమని మండిపడ్డారు. ఆత్మవంచన వద్దు.. ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలకు నాగిరెడ్డి సూచించారు.