ఢిల్లీ: నగరంలో జరిగిన వ్యవసాయ మంత్రులు భేటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ శాఖకు చెందిన మంత్రి రాకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సమావేశానికి నాగిరెడ్డి హాజరైయ్యారు. అన్ని రాష్ట్రాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనగా, ఏపీ నుంచి మంత్రి రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఇందులో వ్యవసాయానికి సంబంధించి అనేక అంశాలను తాను లేవనెత్తినట్లు పేర్కొన్నారు. వ్యవసాయాంత్రీకరణపై పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయడమే కాకుండా, కడియంలో స్థూల పరిశోధన సంస్థలు నిర్మించాలన్నారు. పాల దిగుబడి పెంచేందుకు స్థానిక పశు అభివృద్ధిపై పరిశోధనలు పెంచాలని మండలికి సూచించినట్లు నాగిరెడ్డి తెలిపారు.