హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్న అనైతిక రాజకీయ కార్యకాలపాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'సేవ్ డెమొక్రసీ' కార్యక్రమం విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు వ్యక్తిగత దూషణలతో అడ్డగోలుగా విమర్శిస్తున్నారని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్టు విమర్శించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయింపులు ఏ రాష్ట్రంలో జరిగినా తప్పేనని నాగిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, లక్షలాది మంది రైతులు వలసబాట పట్టారని చెప్పారు.
'టీడీపీ నేతలు భయపడుతున్నారు'
Published Sun, Apr 24 2016 3:26 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement