
'జగనన్న రాకకు.. వర్షం స్వాగతం పలికింది'
నంద్యాల: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకృతి ప్రేమికుడని, అదే చంద్రబాబు ప్రకృతి ద్వేషి అని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. అనంతలో చంద్రబాబు పాదం మోపగానే కరువు తిష్టవేసిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా.. చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
మహానేత తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల ఎన్నికల ప్రచారానికి రానున్న నేపథ్యంలో వరుణుడు స్వాగతం పలకడం శుభసూచకమని ఆనందం వ్యక్తం చేశారు. జగన్‌కు తిరుగులేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిగా పక్కనబెట్టారని, హామీలను ఒక్కసారైనా పరిశీలించుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీ కెనాల్‌లో చుక్క నీరు కూడా లేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వానివి మాటలు తప్పా.. చేతలు కనిపించవని అన్నారు.