జీవో 271 రైతుల ప్రయోజనాలకు హానికరంగా పరిణమించిందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: జీవో 271 రైతుల ప్రయోజనాలకు హానికరంగా పరిణమించిందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. జీవో 271 వల్ల ఉత్పన్నమవుతున్న దుష్ఫలితాలను, రైతుల్లో నెలకొన్న ఆందోళనను వివరించారు. ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని కోరుతూ ఈ నెల 23న విజయవాడ గాంధీనగర్‌లోని రైస్‌మిల్లర్స్ హాలులో నిర్వహించే అఖిలపక్ష రైతు సంఘాల సమావేశానికి వైఎస్సార్‌సీపీ నేతలను పంపాలని ఆయన జగన్‌కు విజ్ఞప్తి చేశారు. పార్టీ నుంచి ఇద్దరు ముఖ్యనేతలను పంపుతానని జగన్ ఆయనకు హామీ ఇచ్చారు.