సాక్షి, అనంతపురం : టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. ఐదు లక్షల కుటుంబాలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారని ఆయన అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారాల గ్రామంలో రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగిరెడ్డి మాట్లాడుతూ మారాలలో కూడా ఒక్క విడత కూడా రుణమాఫీ అమలు కాలేదన్నారు. గ్రామంలోని 22 డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ కాలేదని తెలిపారు. గ్రామ చెరువు విషయంలో దివంగత ముఖ్యమంత్రి రూ.90 లక్షలు ఖర్చు చేశారన్నారు. మహానేత వైఎస్‌ఆర్ అకాల మరణంతో పనులు ఆగిపోయాయని, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని అన్నారు. అనంతపురం జిల్లా తీవ్ర సంక్షోభంలో ఉందని ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment