marala
-
రైతు సంక్షేమాన్ని విస్మరించారు: ఎంవీఎస్
సాక్షి, అనంతపురం : టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. ఐదు లక్షల కుటుంబాలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారని ఆయన అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారాల గ్రామంలో రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగిరెడ్డి మాట్లాడుతూ మారాలలో కూడా ఒక్క విడత కూడా రుణమాఫీ అమలు కాలేదన్నారు. గ్రామంలోని 22 డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ కాలేదని తెలిపారు. గ్రామ చెరువు విషయంలో దివంగత ముఖ్యమంత్రి రూ.90 లక్షలు ఖర్చు చేశారన్నారు. మహానేత వైఎస్ఆర్ అకాల మరణంతో పనులు ఆగిపోయాయని, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని అన్నారు. అనంతపురం జిల్లా తీవ్ర సంక్షోభంలో ఉందని ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన చెందారు. -
గొంతులోకి టూత్ బ్రష్
మారాల (బుక్కపట్నం) : గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కుమారుడు హర్షవర్ధన్ ఆదివారం ఉదయం పళ్లు శుభ్రం చేసుకునేందుకు బ్రష్ చేసుకుంటుండగా పొరపాటున అది గొంతులోకి జారింది. బాలుడి తల్లీదండ్రులు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. బాలుడు అవ్వతాతల వద్ద ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు రామ్మోహన్ ఆ బాలుడ్ని అనంతపురంలోని ఈఎన్టీ డాక్టర్ శ్రీనాథ్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన చికిత్స చేసి బ్రష్‌ను బయటకు తీశారు. బాలుడికి ప్రాణాపాయం తప్పడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
కలుషిత నీళ్లు తాగి 17 గొర్రెల మృతి
మారాల (బుక్కపట్నం) : కలుషిత నీళ్లు తాగి 17 గొర్రెలు మతి చెందాయి. మండలంలోని మారాల గ్రామానికి చెందిన కష్టప్ప, రాముడుకు చెందిన గొర్రెల మందకు శుక్రవారం శీకాయకుంట సమీపంలో ఓౖ రెతు బోరు బావి వద్ద నీళ్లు తాపారు. కొద్ది చేపటికి ఒక్కొక్కటిగా 17 గొర్రెలు మతి చెందాయి. రైతు టమోటా తోటకు క్రిమి సంహరక మందులు పిచికారి చేయటం వల్ల కాలువలో మందు నీళ్లు కలిశాయి. విషయం తెలియక ఆ నీళ్లు తాగటంతో 17 గొర్రెలు చనిపోయాయని కాపరులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సంఘటనా స్థలాన్ని వీఆర్ఓ íß జ్జూర్రహిమాన్ పరిశీలించారు.