కలుషిత నీళ్లు తాగి 17 గొర్రెల మృతి
మారాల (బుక్కపట్నం) : కలుషిత నీళ్లు తాగి 17 గొర్రెలు మతి చెందాయి. మండలంలోని మారాల గ్రామానికి చెందిన కష్టప్ప, రాముడుకు చెందిన గొర్రెల మందకు శుక్రవారం శీకాయకుంట సమీపంలో ఓౖ రెతు బోరు బావి వద్ద నీళ్లు తాపారు. కొద్ది చేపటికి ఒక్కొక్కటిగా 17 గొర్రెలు మతి చెందాయి.
రైతు టమోటా తోటకు క్రిమి సంహరక మందులు పిచికారి చేయటం వల్ల కాలువలో మందు నీళ్లు కలిశాయి. విషయం తెలియక ఆ నీళ్లు తాగటంతో 17 గొర్రెలు చనిపోయాయని కాపరులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సంఘటనా స్థలాన్ని వీఆర్‌ఓ íß జ్జూర్‌రహిమాన్ పరిశీలించారు.