విషపూరిత నీరు తాగి 30 గొర్రెల మృతి | 30 sheeps dies of mixed water drunk | Sakshi
Sakshi News home page

విషపూరిత నీరు తాగి 30 గొర్రెల మృతి

Published Tue, May 16 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

విషపూరిత నీరు తాగి 30 గొర్రెల మృతి

విషపూరిత నీరు తాగి 30 గొర్రెల మృతి

కొత్తచెరువు : మండలంలోని నారాయణపురం క్రాస్‌  సమీపంలోని ఓ పొలం వద్ద  విషపూరిత నీరు తాగి 30 గొర్రెలు మృతి చెందాయి. వివరాల మేరకు..  మండలంలోని అప్పలవాండ్లపల్లి తండాకు చెందిన  కోనేనాయక్, గేగనాయక్‌ మంగళవారం 800 గొర్రెలను మేత కోసం తీసుకెళ్లారు. అనంతరం సమీపంలోని రైతు రామక్రిష్ణ  పొలం వద్ద ఉన్న నీటి తొట్టెలో  గొర్రెలు నీరుతాగాయి. అయితే పొలంలో ఉన్న టమాటా పంటకు తెగులు సోకడంతో నివారణ కోసం రైతు క్రిమిసంహారక  మందును  తొట్టెలో కలిపాడు. 

విషయం తెలియని  కాపరులు  గొర్రెలకు నీరు తాగించారు. కొద్ది సేపటికే గొర్రెలు నోట్లో  నురుగు కక్కుతూ పడిపోయాయి.  వారు వెంటనే  స్థానిక పశువైద్యాధికారి  నవీన్‌కుమార్‌రెడ్డికి సమాచారం అందించారు.  ఆయన వెళ్లేటప్పటకి 30 గొర్రెలు మృతి చెందాయి.  మిగిలిన గొర్రెలకు వెంటనే ఆయన చికిత్స అందించి కాపాడారు. దాదాపు రూ.1.50 లక్షల దాకా నష్టపోయామని బాధితులు వాపోయారు.

Advertisement
Advertisement