పిఠాపురం: భూమిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటు పొట్టపోసుకునే నిరుపేద రైతుల పొట్టకొట్టడానికి చూస్తున్నారని, ఉన్న భూమి పోతే ఇక వేరే దారిలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తుని మండలం రాజుపేట వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ వద్ద తుని మండలం రాజుపేట, కొత్త వెలంపేట, సీతయ్యపేట, లోవ కొత్తూరుకు చెందిన పలువురు సన్న, చిన్నకారు రైతులు తమ సమస్యలు విన్నవించుకున్నారు.
పై నాలుగు గ్రామాల పరిధిలో 30 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన సుమారు 500 ఎకరాల భూమిని సుమారు రెండు వేలకు పైగా రైతులు సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఈ గ్రామాల భూములు కొండ ప్రాంతానికి చెందినవి అయినా ఎంతో కష్టపడి చదును చేసుకుని చెరకు, మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సరుగుడు, నిమ్మ, వంటి పంటలతో పాటు అన్ని రకాల వాణిజ్య పంటలు పండిస్తు జీవిస్తున్నామన్నారు. ఈ భూములపై కన్నెసిన అధికార పార్టీ నేతలు అ««ధికారాన్ని అడ్డుపెట్టుకుని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇటీవల పారిశ్రామికవాడ పేరుతో భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు 32 ఎకరాల భూములకు చెందిన రైతులకు స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. వీటితో పాటు మిగిలిన సుమారు 450 ఎకరాలను స్వాధీనం చేసుకుంటామని అధికారులు చెబుతున్నారన్నారు. వేల కుటుంబాలను వీధి పాలు చేస్తు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ దురాగతాన్ని ఆపి తమను కాపాడాలని వైఎస్ జగన్‌కు రైతులు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment