
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిది రైతు ప్రభుత్వమని, నవరత్నాల్లో కూడా మొదటిగా రైతుల సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చినట్లు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటిభారత్ బంద్‌కు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9 గంటలు పగలు విద్యుత్ ఇస్తోందని, బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు.
ఏదైతే కేంద్రాన్ని ప్రస్తుతం రైతులు డిమాండ్ చేస్తున్నారో వాటిని మన రాష్ట్రంలో పరిష్కరించామని వెల్లడించారు. రేపటి బంద్ వల్ల రైతుకు న్యాయం జరగాలని కోరుతూ.. రైతులపై, రైతుల సంఘాలపై గౌరవంతో ఈ బంద్ కి సంఘీభావం తెలుపుతున్నామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment