raithu bandh
-
Somesh Kumar: క్విడ్ ప్రోకోతో భూముల కొనుగోలు!
హైదరాబాద్: మాజీ సీఎస్, ధరణి రూపకర్తగా పేరున్న సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాతిక ఎకరాల భూమిని తక్కువ ధరలకు చెల్లించి ఆయన కొనుగోలు చేయడం.. అదీ ఫార్మా సిటీ ప్రాంతంలోనే కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్విడ్ ప్రోకో అంశంపై తెరపైకి వచ్చింది. ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని.. ప్లాన్ప్రకారమే యాచారంలో భూములు కొన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం అయిన కొత్తపల్లిలో 25 ఎకరాల్ని నలుగురి దగ్గరి నుంచి ఆయన కొన్నారు. అందుకుగానూ ఎకరానికి రూ.2 లక్షలు చెల్లించారు. అయితే అది సోమేష్ భార్య పేరిట ఉన్నట్లు ధరణి రికార్డుల్లోనూ ఇది నమోదు అయ్యింది. లక్షల్లో రైతుబంధు సొమ్ము తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ భూముల ద్వారా సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి విలేజ్‌లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు 14 లక్షల 5 వేల 550 రూపాయల రైతుబంధు తీసుకున్నట్లు సమాచారం. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ, సోమేశ్ కుటుంబం.. సాగు చెయ్యకుండానే రైతుబంధు పొందినట్లు తెలుస్తోంది. అదేకాకుండా ఆయన బంధువులు మొత్తం 150 ఎకరాలకు సంబంధించి భూమిపై రైతుబంధు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇక.. ఏడాదికి రెండు దఫాల్లో 2 లక్షల 52,750 రూపాయల రైతుబంధు డబ్బును సోమేశ్ కుమార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రెరా సెక్రటరీగా పని చేసిన శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో సోమేష్‌కుమార్ కూడా రెరాలో పని చేయడంతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. -
సొమ్ము లేకుండా సాగేదెలా?
సాక్షి, హైదరాబాద్: వానాకాలం మొదలైంది. పంటల సాగుకు సమయం వచ్చేసింది. కానీ రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక.. వ్యవసాయ పెట్టుబడి కోసం అగచాట్లు పడుతున్నారు. రైతుబంధు కోసం ఓవైపు.. పంట రుణాల కోసం మరోవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రైతుబంధు సొమ్ము ఎప్పుడు వేస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదని, బ్యాంకులు రుణాలివ్వడం ప్రారంభించలేదని.. దీంతో సీజన్ మొదట్లోనే అడ్డగోలు వడ్డీ కింద ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోందని అన్నదా తలు వాపోతున్నారు. రైతుబంధు సొమ్ము వెం టనే ఇవ్వడంతోపాటు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సాగు మొదలైనా.. రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో పడ్డారు. కొందరు రైతులు ఇప్పటికే పత్తి, కంది విత్తనాలు వేశారు. వ్యవసాయ శాఖ తాజా అంచనా ప్రకారం దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో పంటల సాగు మొదలైంది. ఇందులో అత్యధికం గా 4 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. మరో లక్ష ఎకరాల్లో కంది, సోయాబీన్ వంటి పంటలు వేశారు. వానలు మరింతగా విస్తరించగానే సాగు జోరందుకోనుంది. రైతు బంధుపై అస్పష్టత ఏటా వానాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికే అన్నదాతలకు రైతుబంధు సొమ్ము చేతికందుతోంది. గతేడాది కూడా జూన్ 15 నాటికి రైతుబంధు ఇచ్చారు. ఈసారి 20వ తేదీ దాటుతున్నా సొమ్ము విడుదల కాలేదు. వ్యవసాయ వర్గాలు కూడా ఇంకా రైతుబంధు విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సమాచారమేదీ లేదని చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రైతుబంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించింది. అందులో ప్రస్తుత వానాకాలం సీజన్లో కోటిన్నర ఎకరాలకుపైగా భూములకు సంబంధించి 63.25 లక్షల మందికి రైతుబంధు ఇవ్వాల్సి ఉం టుందని.. ఇందుకు రూ.7,508.78 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 2021–22 వ్యవసాయ సీజన్లో ప్రభుత్వం మొత్తం రూ.14,772 కోట్లను రైతుబంధు కింద అందజేసింది. ఈసారి మాత్రం ఇప్పటికీ స్పష్టత రాకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందని బ్యాంకు రుణాలు వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. నిజానికి ఈ ఏడాది రూ.1.01 లక్షల కోట్ల మేర వ్యవసాయం, అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. అందులో వానాకాలం సీజన్‌కు రూ. 51,229.98 కోట్లు, యాసంగికి రూ.34,153.32 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్ఎల్బీసీ సమావేశాన్ని ఇటీవలే నిర్వహించి, లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంతో.. ఇంకా పంట రుణాల జారీ మొదలుకాలేదు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా స్పందన రావడం లేదు. రుణమాఫీ జరగకపోవడం, పాత పంట రుణ బకాయిలు ఉండటంతో బ్యాంకులు రుణాలు నిరాకరించడానికి కారణమని రైతులు అంటున్నారు. ఇటు రైతు బంధు సొమ్ము రాక, అటు బ్యాంకులు రుణాలివ్వక ప్రైవేట్ అప్పులు తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. రుణం దొరికినా అవసరం కంటే తక్కువే.. సాధారణంగా ఏ పంటకు ఎంత పెట్టుబడి అవసరం, ఎంత రుణం ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వం ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) దానిని రూపొందించి.. అన్ని బ్యాంకులకు పంపింది. పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.40 వేల మేర పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. ఏటా ఇలా కనీస రుణాలను నిర్ణయిస్తున్నా.. బ్యాంకులు మాత్రం తక్కువ మొత్తంలోనే రుణాలే ఇస్తున్నాయి. అవి పంట పెట్టుబడులకు సరిపోక రైతులు బయట మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. పంట పెట్టుబడికి డబ్బుల్లేక.. నాకున్న మూడెకరాల్లో గతేడాది 2 ఎకరాల్లో వరి, ఎకరంలో పత్తి వేశా. పత్తి పూర్తిగా దెబ్బతింది. వరికి నష్టం వచ్చి.. రెండెకరాలకు 18 క్వింటాళ్ల ధాన్యమే వ చ్చింది. అప్పటికే బిడ్డ పెళ్లికోసం చేసిన రూ.4 లక్షల అప్పు ఉండగా.. పంట పెట్టుబడి అప్పు కూడా మీదపడింది. అప్పులకు వడ్డీ పెరిగిపోతోందని కొంత భూమి అ మ్మేసి కట్టిన. ఇప్పుడు విత్తనాలు వేద్దామం టే పెట్టుబడికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నా. రైతుబంధు ఇప్పటివరకు రాలేదు. – సింగిరెడ్డి సుధాకర్‌రెడ్డి, అమీనాపురం, కేసముద్రం రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నా.. నాకు ఏడెకరాల భూమి ఉంది. అం దులో రెండున్నర ఎకరాలు పత్తి, మరో రెం డున్నర ఎకరాల్లో మిర్చి, మిగతా రెండెకరా ల్లో వరి వేస్తాను. వివిధ కర్చులు కలిపి ఎకరానికి రూ.8,500 వరకు ఖర్చవుతాయి. ఇప్పటివరకు రైతుబంధు సొమ్ము రాలేదు. గతంలో ఈ సమయానికే అందేది. పాత బకాయిలు పేరుకుపోవ డం, రుణమాఫీ జరగకపోవడంతో బ్యాం కర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో అడ్డగోలు వడ్డీకి ప్రైవేట్ అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. డబ్బులకోసం వేచి చూస్తున్నా. – ఇందుర్తి రంగారెడ్డి, రైతు, పోచారం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా -
‘సీఎం జగన్‌ది రైతు ప్రభుత్వం'
-
‘సీఎం జగన్‌ది రైతు ప్రభుత్వం'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిది రైతు ప్రభుత్వమని, నవరత్నాల్లో కూడా మొదటిగా రైతుల సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చినట్లు వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటిభారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ రైతు విభాగం మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9 గంటలు పగలు విద్యుత్ ఇస్తోందని, బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఏదైతే కేంద్రాన్ని ప్రస్తుతం రైతులు డిమాండ్ చేస్తున్నారో వాటిని మన రాష్ట్రంలో పరిష్కరించామని వెల్లడించారు. రేపటి బంద్ వల్ల రైతుకు న్యాయం జరగాలని కోరుతూ.. రైతులపై, రైతుల సంఘాలపై గౌరవంతో ఈ బంద్ కి సంఘీభావం తెలుపుతున్నామని ఆయన చెప్పారు. చదవండి: Chandra Babu Naidu బాబోయ్.. మీకో దండం! -
దళితబంధు పథకంపై హుజురాబాద్ లో సంబరాలు
-
దళిత బంధు మాదిరిగా తమకు నిధులు విడుదల చేయాలి : లంబాడా నేతలు
-
అన్నదాతల పాలిట రాబందు కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు, రాష్ట్రాన్ని చూస్తుంటే రైతు అన్ని విధాలుగా ‘బంద్’ అయ్యేలా సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. దీంతో పరిస్థితులు ఘోరంగా మారిపోయాయని ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయని సోషల్ మీడియా వేదికగా దుయ్యబాట్టారు. ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారని అన్నారు. చదవండి: కేసీఆర్ హామీలు పిట్టలదొర కబుర్లే మరోవైపు రైతుల దగ్గరే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయినట్లు తెలుస్తోందన విజయశాంతి తెలిపారు. ఈ ధాన్యం సంగతేమిటో తెలంగాణ రైతుకు మిగిలేదేమిటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆరెస్ ప్రభుత్వానిదే అని ఆమె డిమాండ్ చేశారు. ఎంఎస్పీ లేదా కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చెప్పని ప్రయోగాలను తెలంగాణలో చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. -
చంద్రన్న.. ముంచాడు రైతన్నను
సాక్షి, ద్వారకా తిరుమల: రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు.. ఇవన్నీ చేయకపోగా, ఏటా బ్యాంకుల ద్వారా ఎల్టీ రుణాలు పొందిన రైతులకు ఆరు శాతం రాయితీని ఎగవేశాడు. గడచిన ఐదేళ్లకాలంలో జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు రాయితీ వర్తించలేదు. అన్నదాతలను ఇంత మోసం చేసిన చంద్రబాబు, ఎన్నికలు వచ్చేసరికి సుఖీభవ పేరుతో అరకొరగా రైతుకు రూ.1,000 అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అన్నదాతలను అడుగడుగునా మోసం చేస్తూనే వచ్చింది. రుణమాఫీ పేరుతో అబద్ధపు హామీలిచ్చి గత ఎన్నికల్లో విజయాన్ని సాధించి, గద్దెనైతే ఎక్కాడు గానీ.. ఏ ఒక్క రైతుకు బాబు మేలు చేసింది లేదు. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు రైతన్నలను కుదేలు చేస్తుంటే, కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో రైతులు బ్యాంకుల ద్వారా ట్రాక్టరు, పశువులు, గొర్రెల కొనుగోలుకు, అలాగే బోర్లు వేసుకునేందుకు రుణాలు పొంది, ఏడాది పొడవునా బకాయిలు లేకుండా, సకాలంలో రుణాలు చెల్లించిన ప్రతి రైతుకు 6 శాతం రాయితీ ఇచ్చేవారు. అంటే రూ.లక్షకు, రూ.6 వేలు రాయితీ రైతుకు లభించేది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణాలను మాఫీ చేయని బాబు, 6 శాతం రాయితీని మాత్రం మాఫీ చేశాడు. జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపి, కోట్లాది రూపాయల రాయితీ సొమ్మును ఎగవేసింది. అకౌంట్లకు జమచేస్తామంటూ.. గతంలో రైతులు రుణం చెల్లించే సమయంలో బ్యాంకు అధికారులు 6 శాతం రాయితీని మినహాయించి, మిగిలిన సొమ్మును జమచేసుకునేవారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు రైతులు బ్యాంకులకు వెళ్తే, పూర్తి సొమ్ము జమచేయాలని, 6 శాతం రాయితీ తరువాత మీ బ్యాంకు ఖాతాల్లో పడతాయని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క రైతుకు చిల్లిగవ్వ రాయితీ సొమ్ము అందలేదు. ఇది బయటకు కనిపించని మోసమని రైతులు అభివర్ణిస్తున్నారు. రైతులను ఇంత మోసం చేసిన బాబుకు గురువారం జరిగే ఎన్నికల పోలింగ్‌లో ఓటుతో బుద్ధి చెబుతామని అంటున్నారు. దగాకోరు బాబు చంద్రబాబు దగాకోరు. రైతులను నమ్మించి మోసం చేశాడు. రుణమాఫీ పేరుతో గత ఎన్నికల్లో గెలిచి, రైతుల నడ్డి విరిచాడు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎల్టీ రుణాలు పొంది, సకాలంలో తిరిగి చెల్లించిన ప్రతి రైతుకు 6 శాతం రాయితీ ఇచ్చి, ఆదుకున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. గడచిన ఐదేళ్లలో ఒక్క పైసా కూడా రైతులకు అందలేదు. –అల్లాడ హరే రామకృష్ణ, దొరసానిపాడు, ద్వారకా తిరుమల మండలం, రైతు సుఖీభవ ఎందుకు? గత ఎన్నికల్లో చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. ఇచ్చిన హామీ ప్రకారం రుణాలను మాఫీ చేస్తే బాగుండేది. అలాకాకుండా రైతులకు ఎప్పుడు ఇచ్చే రాయితీని మాఫీ చేయడం ఏమీ బాగోలేదు. రైతే రాజంటూ, రైతులకు అండగా ఉంటామని చెప్పే చంద్రబాబు, రైతుల కోసం ఏం చేశారో తెలియడం లేదు. మరోసారి అధికారం కట్టబెడితే బాబు రైతనేవాడినే లేకుండా చేస్తాడు. –పాకలపాటి సుబ్బారావు, దొరసానిపాడు, ద్వారకాతిరుమల మండలం, రైతు జిల్లా రైతాంగం మోసపోయింది గత ఎన్నికల్లో జిల్లా రైతాంగం చంద్రబాబును పూర్తిగా నమ్మింది. ఓట్లు వేసి గెలిపిస్తే ఎంతో మేలు చేస్తాడని ఆశపడ్డాం. జిల్లాలోని రైతులందరం కలసి బాబుకు పట్టం కట్టాం. అయితే గడచిన ఐదేళ్లలో బాబు రైతుల కోసం చేసిందేమీ లేదు. ఎన్నికలు దగ్గరపడగానే సరికి డ్వాక్రా మహిళలకు పసుపు, కుంకుమ పేరుతో ఎలా గేలం వేశాడో.. అదే విధంగా రైతులకు సుఖీభవ పేరుతో గేలం వేశాడు. కానీ అన్నదాతలు అంత ఆలోచన లేనివారు కాదు. బాబుకు తగిన బుద్ధి చెప్పి తీరుతాం. అల్లాడ సత్యనారాయణ, దొరసానిపాడు, ద్వారకాతిరుమల మండలం, రైతు -
హామీలన్నీ.. నీటిమూటలు
‘ముందు దగా.. వెనుక దగా.. కుడి, ఎడమల దగాదగా’ అన్న మహాకవి మాటను అక్షరం పొల్లు పోకుండా ఐదేళ్ల టీడీపీ పాలన రుజువు చేసింది. ఏదో ఒకవిధంగా గద్దెనెక్కాలన్న ఆత్రంతో.. అమలు సాధ్యం కాని బాసలు చేసి, అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు.. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన నమ్మిన జనం గొంతు కోశారు. వారూ వీరూ అనే తేడా లేకుండా ప్రజలపై పగబట్టినట్టుగా వ్యవహరించారు. ఫలితంగా గత ఎన్నికల వేళ ఆయన హామీలు నమ్మిన వారు నిట్టనిలువునా నట్టేట మునిగిపోయారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాట మీద నిలబడేవారికే నాయకులుగా గుర్తింపు ఉంటుంది. ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజా అవసరాల దృష్ట్యా ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాలను కూడా అమలు చేసినవారు, వారి కష్టాలకు పరిష్కారం చూపినవారే నిజమైన ప్రజా నాయకులవుతారు. వారి గుండెల్లో గూడు కట్టుకుని కలకాలం ఉంటారు. దానికి విరుద్ధంగా హామీలిచ్చి, నమ్మించి ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక మాట తప్పిన నేతను మోసగాడు, నమ్మక ద్రోహి, అవకాశవాది అంటారు. గత ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 600 పైగా హామీలిచ్చారు. వాటిల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేదు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా అభివృద్ధి ఊసే లేదు. సరికదా! గతంలో ఉన్న పథకాల్ని, మంజూరైన అభివృద్ధి పనుల్ని సహితం పూర్తి చేయని అసమర్థ ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. నత్తనడకగా డెల్టా ఆధునికీకరణ గోదావరి డెల్టా ఆధునికీకరణకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,710 కోట్లు కేటాయించారు. రూ.1,190 కోట్లతో పంట కాలువలను, రూ.550 కోట్లతో మురుగునీటి కాలువలను ఆధునికీకరించాల్సి ఉంది. వైఎస్ హయాంలో రూ.650 కోట్ల మేర కాంట్రాక్ట్‌లు ఖరారు చేయగా, తరువాత రూ.150 కోట్లు.. మొత్తం రూ.800 కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. ఇప్పటికీ ఆ పనులు పూర్తి చేయలేకపోయారు. గోతులమయంగా ఆర్అండ్బీ రోడ్లు ఆర్అండ్బీ రోడ్లు గోతులమయంగా తయారయ్యాయి. వీటికి మరమ్మతులు చేపటాల్సి ఉంది. జిల్లాలో 4,400 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లున్నాయి. వీటిలో ఏటా సుమారు 1,100 కిలోమీటర్ల మేర తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి. ఇందుకు రూ.330 కోట్లు అవసరం. డబుల్ లేన్ రోడ్లకైతే మరో రూ.120 కోట్లు కేటాయించాలి. మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేయాలి. కొత్త రోడ్ల కోసం మరో రూ.100 కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం ఆ స్థాయిలో నిధులు ఇవ్వడంలేదు. జిల్లాలో 150 గ్రామాలకు లింకు రోడ్లు లేవు. ఇందుకోసం రూ.100 కోట్లు అవసరం. వీటికి కూడా నిధులు విడుదల చేయడం లేదు. చంద్రబాబు హామీలు.. నీటిమూటలు కాకినాడలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. కొండయ్యపాలెం వంతెన పనులు పూర్తి చేస్తామన్నారు. కాకినాడలో పేదల ఇళ్ల మరమ్మతులకు రూ.10 వేల చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఉప్పుటేరు అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరు చేస్తామన్నారు. పెద్దాపురం వద్ద చెత్త ద్వారా విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. లాజిస్టిక్స్, ప్యాకేజీ, నిఫ్ట్ విశ్వవిద్యాలయాలను జిల్లాకు కేటాయించినట్టు చెప్పారు. హోప్ ఐలాండ్‌ను రూ.9 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. స్వదేశీ దర్శన్ పథకం కింద జిల్లాలోని సాగరతీరం వెంబడి రూ.99 కోట్లతో పర్యాటకాభివృద్ధి చేస్తామన్నారు. వీటిలో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలుకు నోచలేదు. జన్మభూమిలో చెప్పిన వాటికీ దిక్కులేదు రామచంద్రపురంలో 45 రోజుల్లో ప్రతి ఇంటికీ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ ఇస్తామని సీఎం చెప్పి రెండేళ్లు దాటిపోయింది. ఒక కాలనీకి మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. స్మార్ట్ డ్రైనేజీ పథకం ద్వారా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకస్తామన్నారు. ఇంతవరకూ మోక్షం లేదు. శేరిలంక గ్రామాన్ని ముంపు నుంచి కాపాడేందుకు, కోతను నివారించేందుకు రూ.16 కోట్లతో పనులు చేపడతామని ప్రకటించారు. ఇంతవరకూ ఆ దిశగా చర్యలే లేవు. పసలపూడి – వెల్ల బైపాస్ రోడ్డుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. దానికి అతీగతీ లేదు. కె.గంగవరం మండలం సుందరపల్లి నుంచి బ్రహ్మపురి వరకూ 21 కిలోమీటర్ల ఏటిగట్టును రూ.40 కోట్లతో అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. పనులు మొదలు కాలేదు. ముమ్మిడివరం నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న ఆరు ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకాల మరమ్మతులకు రూ.6 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం – గొల్లగరువులో నిలిచిపోయిన వంతెన పనులకు రూ.60 కోట్లతో తిరిగి అంచనాలు రూపొందించి టెండర్లు పిలుస్తామన్నారు. గుజరాత్ పెట్రోలియం సంస్థ నుంచి మత్స్యకారులకు రావల్సిన 12 నెలల నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీటిల్లో ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలదీ అదే తీరు రాష్ట్ర శాసనసభ సాక్షిగా పెట్రో యూనివర్సిటీ, పెట్రోలియం కారిడార్, ఎల్అండ్జీ టెర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, పోర్టు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు, వీసీఐసీ కారిడార్‌లో కాకినాడ, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ, అక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, భూ ఉపరితల జలమార్గాలు తదితర అంశాలపై చంద్రబాబు ఆర్భాటంగా హామీలిచ్చారు. కానీ, వాటికి కూడా ఇంతవరకూ అతీగతీ లేదు. ఇంకా మరెన్నో.. పిఠాపురం బ్రాంచి కెనాల్ ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. సుద్దగెడ్డ ముంపు నుంచి గొల్లప్రోలుకు రక్షణ కోసం ఇటీవల శంకుస్థాపన చేశారు. కానీ నిధులు విడుదల చేయలేదు. ఉప్పాడ మినీ హార్బర్‌కు నిధులు కేటాయించలేదు. సఖినేటిపల్లి – నరసాపురం బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోలేదు. నాలుగు విలీన మండలాల్లో 57 ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు అవసరమైన రూ.1,300 కోట్లు విడుదల చేయలేదు. దీంతో సాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. రాజమహేంద్రవరంలో మొట్టమొదటి రైలు వంతెన హేవలాక్ బ్రిడ్జిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న హామీ గోదారిలో కలిసిపోయింది. వడ్డీకే సరిపోని రైతు రుణమాఫీ గత ఎన్నికల వేళ రైతులకు రుణమాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ రుణబకాయిలు చెల్లించనవసరం లేదని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ, రైతులకు రుణ విముక్తి కలగలేదు. మాఫీ చేస్తానన్న చంద్రబాబు తూచ్ అనేశారు. చంద్రబాబు హామీ ఇచ్చే నాటికి జిల్లాలో 6.50 లక్షల మంది రైతులు రూ.13,009 కోట్ల రుణం తీసుకున్నారు. ఆయన సీఎం అయ్యాక రుణమాఫీపై తొలి సంతకం చేశారు. దీంతో రుణాలన్నీ మాఫీ అయిపోతాయని రైతులు భావించారు. కానీ, షరా మామూలుగానే రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచారు. మూడు విడతలుగా రూ.961.93 కోట్లు మాత్రమే మాఫీకి మంజూరు చేశారు. దీంతో తీసుకున్న రుణంలో పదో వంతు కూడా మాఫీ కాని పరిస్థితి నెలకొంది. ఇందులో కూడా చాలావరకూ రైతుల ఖాతాలకు జమ కాలేదు. మరోపక్క చంద్రబాబు మాఫీ చేస్తానన్నారని బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపు రూ.4 వేల కోట్ల మేర వడ్డీ భారం రైతులపై పడింది. రుణమాఫీకి అర్హులైన రైతులు : 6.50 లక్షలు రుణమాఫీ కావాల్సిన మొత్తం : రూ.13,009 కోట్లు మూడు విడతలుగా విడుదల చేసిన నిధులు : రూ.961.93 కోట్లు నాలుగున్నరేళ్లలో రైతులు తీసుకున్నరుణంపై పడిన వడ్డీ : రూ.4 వేల కోట్లు నిరుద్యోగులకు కుచ్చుటోపీ ఎన్నికలకు ముందు ఇంటికొక ఉద్యోగమని చంద్రబాబు అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని ఆ పార్టీ నాయకులు ఊదరగొట్టారు. కానీ, నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. భృతీ ఇవ్వలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం రూ.2 వేలకు బదులు రూ.వెయ్యి ఇస్తామంటూ హడావుడి చేశారు. ఇందులో కూడా డిగ్రీ, డిప్లమో అంటూ ఆంక్షలు పెట్టి నిరుద్యోగ లబ్ధిదారుల సంఖ్యను కుదించేశారు. జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరికీ నాలుగున్నరేళ్లలో రూ.900 కోట్ల వరకూ భృతి ఇవ్వాల్సి ఉండగా.. ఆంక్షల పేరుతో 20 వేల మందికి పరిమితం చేసి, అది కూడా ఎన్నికలకు ఆరు నెలలు ముందు, రూ.2 వేలకు బదులు రూ.వెయ్యితో సరిపెట్టి మమ అనిపించేశారు. భృతికి అర్హులైన నిరుద్యోగులు : 4,10,000 ఆంక్షలతో ఎంపిక చేసిన నిరుద్యోగులు : 20,000 మహిళలకు దగా రెండో సంతకంతో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. పెట్టుబడి నిధి అని కొన్నాళ్లు అన్నారు. తర్వాత పసుపు – కుంకుమ అని డ్రామాలు మొదలుపెట్టారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చేనాటికి జిల్లాలోని 89,433 సంఘాలకు రూ.1,326.42 కోట్లు మాఫీ చేయాలి. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికీ రూ.10 వేలని చెప్పి ఇంతవరకూ రూ.837 కోట్లు మాత్రమే పెట్టుబడి నిధి కింద బ్యాంకు ఖాతాలకు పరిమితం చేశారు. దానికి పసుపు – కుంకుమ అని పేరు పెట్టారు. వాస్తవానికి పెట్టుబడి నిధి కింద ఇచ్చిన రూ.10 వేలు వారు తీసుకున్న రుణాల వడ్డీకే సరిపోలేదు. నాలుగున్నరేళ్ల కాలంలో మహిళలు తీసుకున్న రుణాలకు రూ.వెయ్యి కోట్లు పైగా వడ్డీ పడింది. ఈ లెక్కన ప్రభుత్వమిచ్చిన రూ.837 కోట్లు వడ్డీకే చాలని పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ప్రకటించారు. అది కూడా మూడు విడతలని చెప్పి, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. దీనిని మోసం కాకపోతే ఏమంటారో! 2014 మార్చి 31 నాటికి రుణ బకాయిలు : రూ.1326.42 కోట్లు బకాయి పడిన డ్వాక్రా సంఘాలు : 89,433 తీసుకున్న రుణంపై పడిన వడ్డీ రూ.వెయ్యి కోట్లు పైనే.. పెట్టుబడి నిధి కింద బ్యాంకు ఖాతాలకు జమ చేసిన నిధులు : రూ.837 కోట్లు -
కరుణించు ‘ధరణి’ మాతా
సాక్షి, హైదరాబాద్: చీదెళ్ల అనే ఇంటి పేరు ఉన్న ఓ రైతు ఆధార్‌కార్డులో ఇంటి పేరు సీహెచ్ అని ఇంగ్లిష్‌లో నమోదయింది. అదే పట్టాదారు భూరికార్డుల్లో చీదెళ్ల అని పూర్తిగా తెలుగులో నమోదయి ఉంది. ఆధార్‌లో సీహెచ్ అని, పట్టాదారు రికార్డుల్లో చీదెళ్ల అని వేర్వేరుగా ఇంటిపేరు ఉండి సరిపోలకపోవడంతో పాసుపుస్తకం మంజూరుకు సాఫ్ట్వేర్ సహకరించడం లేదు. ఆ రైతు మీ సేవలో తన వేలిముద్రలను ఇచ్చి పట్టాదారు రికార్డుల్లోగాని, ఆధార్ కార్డుల్లోగాని ఒకే విధమైన ఇంటి పేరును నమోదు చేసుకుంటేనే పాసుపుస్తకం జారీకి వీలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’వెబ్సైట్ ద్వారా రెవెన్యూ సేవల విషయంలో కలుగుతున్న అవాంతరాలకు ఇదో మచ్చుతునక. ధరణి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే కాంట్రాక్టును అనుభవం లేని ఐఎల్ఎఫ్ఎస్ అనే సాఫ్ట్వేర్ సంస్థకు ఇవ్వడం, ఏ అధికారి స్థాయిలో ఏ సమస్యను పరిష్కరించే అధికారం ఇవ్వాలనే విషయంలో సమగ్రత లోపించడం, రెవెన్యూ సిబ్బందిపై పడుతున్న అదనపు పనిభారం వెరసి రాష్ట్ర రైతాంగం క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు పడుతోంది. ధరణి ప్రాజెక్టు ద్వారా రైతులకు సమీకృత రెవెన్యూ సేవలందించాలని, క్రయ, విక్రమాలు జరగ్గానే రైతు ఇంటికి నేరుగా పాసుపుస్తకాలు పంపాలని, ఆ పాసుపుస్తకాలు బ్యాంకుల్లో తనఖా పెట్టకుండానే రికార్డుల ద్వారా సదరు రైతులకు రుణాలిప్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పుట్ల కొద్దీ సమస్యలతో ఇటు రైతులను, అటు రెవెన్యూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ధరణి ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యలివే... –ఆధార్ కార్డు, పట్టాదారు రికార్డుల్లో పేర్లు సరిపోలకపోతే పాసుపుస్తకం జారీకి సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో ఎంట్రీకి గంటల కొద్దీ సమయం పడుతోంది. –తహసీల్దార్లు డిజిటల్ సంతకాలు చేసి పంపిన పాసు పుస్తకాలు ఆరునెలలు దాటినా ఇంతవరకు రాలేదు. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు ప్రాంతాల కంపెనీలకు ఈ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు ఇవ్వడంతో అసలు ఏ కంపెనీని ఆరా తీయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాసుపుస్తకాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని దుస్థితి. –ధరణి సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా తప్పుగా నమోదైతే మళ్లీ దాన్ని సరిచేసే అవకాశం తహసీల్దార్ స్థాయిలో కూడా లేదు. ఆర్డీవో లాగిన్లోకి వెళ్లి దానిని సరిచేయాల్సి వస్తోంది. ఆర్డీవోలు అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఈ పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా నమోదు చేసిన కొత్త సర్వే నంబర్లను ధరణిలో నమోదు చేసే అధికారం తహసీల్దార్ స్థాయిలో లేదు. అదే విధంగా గత రికార్డుల్లో మిస్సింగ్ అయిన నంబర్లను కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఇవి కూడా ఆర్డీవో స్థాయి లాగిన్ ద్వారా చేయాల్సి వస్తుండడంతో తీవ్ర కాలయాపన అవుతోంది. రీసెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్)ను సరిచేసే అధికారం జేసీలకిచ్చారు. ఉదాహరణకు ఒక సర్వేనంబర్ రికార్డుల్లో 20 ఎకరాల భూమి ఉంటే... క్షేత్రస్థాయిలో నిజంగా భూమి 18 ఎకరాలే ఉందనుకోండి. అప్పుడు ఆ భూమికి సంబంధించిన వాస్తవ వివరాలను ధరణిలో నమోదు చేయలేకపోతున్నారు. ఆర్డీవో, జేసీల లాగిన్‌లో ఉన్న అధికారాల పరంగా మార్పులు చేయాలంటే సదరు ఆర్డీవో లేదా జేసీ బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి చేశారు. దీంతో ఆర్టీవో, జేసీ స్థాయి అధికారులు అనేక పనుల్లో బిజీగా ఉండడం, వారే స్వయంగా లాగిన్‌ను బయోమెట్రిక్ ద్వారా ఓపెన్ చేయాల్సి రావడంతో సమస్యల పరిష్కారానికి నెలల సమయం పడుతోంది. ఒక్క పాసుపుస్తకం మంజూరు కావాలంటే తహసీల్దార్ నాలుగు సార్లు బయోమెట్రిక్ నమోదు చేయాల్సి వస్తోంది. ఒక సర్వే నంబర్లో ఐదెకరాల భూమి ఉంటే... అందులో నాలుగెకరాలు సాగు భూమి, మరో ఎకరం వ్యవసాయేతర భూమి ఉందనుకోండి. ఈ రెండింటిని విడివిడిగా నమోదు చేసేందుకు సాఫ్ట్వేర్ సహకరించడం లేదు. ఇంతవరకు ధరణి ప్రాజెక్టు వివరాలను పబ్లిక్ డొమైన్‌లోకి తేలేదు. సీసీఎల్ఏ వెబ్సైట్లో అన్ని రికార్డులు ఉంచామని చెపుతున్నా అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మీ సేవా కేంద్రాలు, లేదంటే సొంత కంప్యూటర్లు, ఫోన్ల ద్వారా ధరణిలోని భూముల వివరాలు అందుబాటులోకి తేవడంతో పాటు సమస్యల పరిష్కారానికి ఓ టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా... బేతుపల్లి సర్వే నంబరు 878/211/అ లో నాకు 1.10 ఎకరాల వ్యసాయభూమి ఉంది. భూప్రక్షాళనలో నా భూమి రికార్డు చేయలేదు. ఎన్నిసార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవటం లేదు. నా సర్వే నంబర్లో భూమి లేదని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసి అనుభవిస్తున్నాం. రెవెన్యూ యంత్రాంగం భూమి లేనివాళ్లకు కూడా రికార్డుల్లో ఎక్కించటం వల్లే నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుంది. నాతోపాటు వందమందికిపైగా రైతులకు పాస్ పుస్తకాలు రాలేదు. ఎస్.వీరరాఘవులు, నారాయణపురం, సత్తుపల్లి మండలం, ఖమ్మంజిల్లా కొలువు లేదు.. సాయం లేదు ‘నాకు అశ్వారావుపేటలో సర్వే నంబరు 1228లో నా తండ్రి పంచి ఇచ్చిన రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి పట్టా జారీ కాలేదు. అసైన్డ్ భూమి కావడంతో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా వారసత్వం చేసి ఇవ్వాలి. కానీ ఎన్నికలు, ఇతర కారణాల వల్ల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం జారీ కాలేదు. దీంతో రైతుబంధు సహాయం అందటం లేదు. నార్లపాటి బుచ్చిబాబు, అశ్వారావుపేట, కొత్తగూడెం జిల్లా సంవత్సరం నుండి తిరుగుతున్నాం మా కుటుంబానికి చింతలపాలెం శివారులోని 226 సర్వే నంబరులో 2.20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పాసుపుస్తకాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి పోయాం. అదిగో ఇస్తున్నాం... ఇదిగో ఇస్తున్నాం.. అని తిప్పుతున్నారు. గట్టిగా అడిగితే సైట్ ఓపెన్ కావడం లేదంటున్నారు. ఉన్నతాధికారులకు పంపామని చెబుతున్నారు. –దేవిరెడ్డి నాగమణి, గుడిమల్కాపురం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా సిబ్బంది పెంచి పనిభారం తగ్గించాలి రిజిస్ట్రేషన్ పద్ధతిలో మార్పు తేవడంతోపాటు కోర్ బ్యాంకింగ్ ద్వారా రైతులకు మేలు చేయాలనే తలంపుతో చేపట్టిన ధరణి నిజంగా మంచి ప్రాజెక్టే. అయితే, రైతులకు ఆశించిన మేలు జరగాలంటే మాత్రం సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి. రెవెన్యూ సిబ్బందిపై ఉన్న అదనపు భారాన్ని తగ్గించాలి. కొత్తమండలాలు, జిల్లాలకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలి. –కె. గౌతం కుమార్, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
రైతుల కోసం మోదీ సర్కార్ మెగా ప్లాన్
-
గండ్రలు గెలిస్తే చేస్తారా?
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.మధుసూదనాచారి పార్టీ బలహీనతల గురించి ప్రస్తావించిన కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన జిల్లా చిట్యాలలో మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు రైతుబంధు పథకం చెక్కులు సరిగా అందలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, కార్పొరేషన్ రుణాల గురించి మైనస్ ఉందని నాయకులు, కార్యకర్తలు చెప్పడంతో వారిపై మధుసూదనాచారి కన్నెర్ర చేశారు. గండ్రలు గెలిస్తే చేస్తారా..? ఏం మాట్లాడుతున్నారు? అంటూ గద్దించడంతో వారు నిరాశతో వెళ్లిపోయారు. ‘ఈయన మారడు.. చెబితే అర్థం చేసుకోడు.. పలకరింపు సరిగా ఉండదు.. అంటూ పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు విమర్శించుకుంటూ వెళ్లిపోవడం విశేషం. -
అందని బంధు
బూర్గంపాడు : పంటలకు గిట్టుబాటు ధర లభించనప్పుడు రైతుల తక్షణ అవసరాల కోసం మార్కెటింగ్ శాఖ రైతుబంధు పథకాన్ని అమలుచేస్తోంది. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ చేసుకుంటే రైతుబంధు పథకానికి అర్హులవుతారు. ఇలా నిల్వచేసిన పంటల కనీస మద్దతు ధరలో 75 శాతం మేర రైతులకు మార్కెటింగ్ శాఖ వడ్డీ లేకుండా రుణం అందజేయడమే రైతుబంధు పథకం ఉద్దేశం. ఇలా ఒక్కో రైతు గరిష్టంగా రూ. 2 లక్షల వరకు రుణం పొందవచ్చు. పంటలను అమ్ముకున్నప్పుడు రుణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల వరకు వడ్డీ ఉండదు. ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి ధరలు వచ్చేవరకు తమ అవసరాలకు తగిన రుణసాయం ఈ పథకంలో అందుతుంది. అయితే ఈ పథకంపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరు మార్కెట్ కమిటీలు... జిల్లాలో కొత్తగూడెం, బూర్గంపాడు, ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేట, చర్లలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ పంటలు నిల్వ చేసుకునేందుకు గోదాములున్నాయి. ధాన్యం, అపరాలు నిల్వచేసుకున్న వారికి రైతుబంధు పథకం వర్తిస్తుంది. అయితే మార్కెటింగ్ అధికారులు రైతులకు అవగాహన కల్పించడకపోవడంతో తక్షణ అవసరాలకు తక్కువ ధరలకే పంటలు అమ్ముకుంటున్నారు. జిల్లాలో నలుగురు రైతులకే వర్తింపు... జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రైతుబంధు పథకాన్ని నలుగురు రైతులకే వర్తింపజేశారు. బూర్గంపాడు మార్కెట్లో ఇద్దరు, కొత్తగూడెంలో ఇద్దరు రైతులు వడ్డీలేని రుణం పొందారు. గత వ్యవసాయ సీజన్లో కూడా జిల్లాలో 40 మంది రైతులకు మాత్రమే ఈ పథకం అమలైంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడం వల్లే ఎక్కువ మంది ఉపయోగించుకోవడం లేదని, మార్కెట్ అధికారులు కరపత్రాలను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి రైతులకు వివరిస్తే ఎంతోమంది వినియోగించుకునే అవకాశాలున్నాయని అంటున్నాయి. ఈ ఏడాది అపరాలకు సరైన గిట్టుబాటు ధర లేకున్నా రైతులు తమ అవసరాల కోసం తక్కువ ధరలకే అపరాలను అమ్ముకుంటున్నారు. ఈ పథకం గురించి తెలిస్తే అపరాలు నిల్వచేసుకుని రుణం తీసుకునేవారు. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం రైతుబంధు పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మార్కెట్ గోదాముల్లో పంటలను నిల్వచేసుకునే రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. చాలామంది రైతులు పంటలు నిల్వ చేసుకునేందుకు ముందుకు రావటం లేదు. ఇక నుంచి గ్రామస్థాయిలో కూడా ఈ పథకంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి -
నిర్లక్ష్యం నిల్వ!
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: పండించిన పంటలను మార్కెట్‌యార్డులో నిలువ చేసేకొని రుణం పొందేందుకు వీలుగా ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం జిల్లాలో కాగితాలకే పరిమితమైంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతల దరికి ఈ పథకం చేరడం లేదు. జిల్లాలో మొత్తం 18 మార్కెట్యార్డులున్నాయి. వీటికి ప్రభుత్వం ఈ ఏ డాది రైతు బంధు పథకం కింద 30 లక్షల రూపాయాల బడ్జెట్‌ను కేటాయించింది. అయితే వార్షిక సంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు గడిచినా జిల్లాలో ఒక్క రైతుకు కూడా ఈ పథకం కింద రుణాన్ని తీసుకోలేదు. నిబంధనలు ఇవీ.. రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్ యార్డులో నిలువచేసి దానికి వచ్చే ధరలో 75శాతం వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు వారి ధాన్యంపై లక్ష రూ పాయల వరకు ఈ పథకం ద్వారా రుణాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మార్కెట్‌యార్డులో ఉంచిన ధాన్యంపై ఉచితంగా బీమా చేసుకోనే అవకాశం ఉంటుంది. రైతులు పొందిన రుణంపై 90 రోజుల వరకు ఎ లాంటి వడ్డీ ఉండదు. వ్యవధిని 270 రోజుల వరకు పొడిగించుకుంటే తీసుకున్న రుణంపై పావల వడ్డీని అ దికారులు తీసుకుంటారు. ఇలా ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోని నష్టాల నుంచి బయట పడవచ్చు. నిద్రావస్థలో అధికారులు ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలోని రైతులు దీనిని సద్వినియోగం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువే. పంటల సాగు కోసం చేసిన అప్పులను తీర్చుకోవడానికి ధాన్యానికి మద్దతు ధర రాకపోయిన అమ్ముకుంటున్నారు. అధికారులు ఈ పథకంపై కొన్ని కరపత్రాలు ముద్రించినా, వాటిని కార్యాలయాలకే పరిమితం చేస్తున్నారు. భద్రత కరువు గతంలో చాలా తక్కువ మంది రైతులు ముందుకు వచ్చి తమ ధాన్యాన్ని మార్కెట్లో నిలువచేసుకున్నారు. అయితే మార్కెటింగ్ శాఖాధికారులు సరియైన పద్ధతిలో ఆ ధాన్యాన్ని భద్రపరచలేకపోతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం పందికొక్కుల పాలైయిందని ఆరోపిస్తున్నారు.