మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: పండించిన పంటలను మార్కెట్‌యార్డులో నిలువ చేసేకొని రుణం పొందేందుకు వీలుగా ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం జిల్లాలో కాగితాలకే పరిమితమైంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతల దరికి ఈ పథకం చేరడం లేదు. జిల్లాలో మొత్తం 18 మార్కెట్‌యార్డులున్నాయి. వీటికి ప్రభుత్వం ఈ ఏ డాది రైతు బంధు పథకం కింద 30 లక్షల రూపాయాల బడ్జెట్‌ను కేటాయించింది. అయితే వార్షిక సంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు గడిచినా జిల్లాలో ఒక్క రైతుకు కూడా ఈ పథకం కింద రుణాన్ని తీసుకోలేదు.
నిబంధనలు ఇవీ..
రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్ యార్డులో నిలువచేసి దానికి వచ్చే ధరలో 75శాతం వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు వారి ధాన్యంపై లక్ష రూ పాయల వరకు ఈ పథకం ద్వారా రుణాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మార్కెట్‌యార్డులో ఉంచిన ధాన్యంపై ఉచితంగా బీమా చేసుకోనే అవకాశం ఉంటుంది. రైతులు పొందిన రుణంపై 90 రోజుల వరకు ఎ లాంటి వడ్డీ ఉండదు. వ్యవధిని 270 రోజుల వరకు పొడిగించుకుంటే తీసుకున్న రుణంపై పావల వడ్డీని అ దికారులు తీసుకుంటారు. ఇలా ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోని నష్టాల నుంచి బయట పడవచ్చు.
నిద్రావస్థలో అధికారులు
ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలోని రైతులు దీనిని సద్వినియోగం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువే. పంటల సాగు కోసం చేసిన అప్పులను తీర్చుకోవడానికి ధాన్యానికి మద్దతు ధర రాకపోయిన అమ్ముకుంటున్నారు. అధికారులు ఈ పథకంపై కొన్ని కరపత్రాలు ముద్రించినా, వాటిని కార్యాలయాలకే పరిమితం చేస్తున్నారు.
భద్రత కరువు
గతంలో చాలా తక్కువ మంది రైతులు ముందుకు వచ్చి తమ ధాన్యాన్ని మార్కెట్లో నిలువచేసుకున్నారు. అయితే మార్కెటింగ్ శాఖాధికారులు సరియైన పద్ధతిలో ఆ ధాన్యాన్ని భద్రపరచలేకపోతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం పందికొక్కుల పాలైయిందని ఆరోపిస్తున్నారు.
నిర్లక్ష్యం నిల్వ!
Published Wed, Dec 11 2013 3:37 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement