
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.మధుసూదనాచారి పార్టీ బలహీనతల గురించి ప్రస్తావించిన కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన జిల్లా చిట్యాలలో మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు రైతుబంధు పథకం చెక్కులు సరిగా అందలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కార్పొరేషన్ రుణాల గురించి మైనస్ ఉందని నాయకులు, కార్యకర్తలు చెప్పడంతో వారిపై మధుసూదనాచారి కన్నెర్ర చేశారు. గండ్రలు గెలిస్తే చేస్తారా..? ఏం మాట్లాడుతున్నారు? అంటూ గద్దించడంతో వారు నిరాశతో వెళ్లిపోయారు. ‘ఈయన మారడు.. చెబితే అర్థం చేసుకోడు.. పలకరింపు సరిగా ఉండదు.. అంటూ పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు విమర్శించుకుంటూ వెళ్లిపోవడం విశేషం.