
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు, రాష్ట్రాన్ని చూస్తుంటే రైతు అన్ని విధాలుగా ‘బంద్’ అయ్యేలా సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. దీంతో పరిస్థితులు ఘోరంగా మారిపోయాయని ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయని సోషల్ మీడియా వేదికగా దుయ్యబాట్టారు. ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారని అన్నారు. చదవండి: కేసీఆర్ హామీలు పిట్టలదొర కబుర్లే
మరోవైపు రైతుల దగ్గరే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయినట్లు తెలుస్తోందన విజయశాంతి తెలిపారు. ఈ ధాన్యం సంగతేమిటో తెలంగాణ రైతుకు మిగిలేదేమిటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆరెస్ ప్రభుత్వానిదే అని ఆమె డిమాండ్ చేశారు. ఎంఎస్పీ లేదా కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చెప్పని ప్రయోగాలను తెలంగాణలో చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment