'వాస్తవవిరుద్ధ ప్రకటనలు మానండి'
హైదరాబాద్: రుణమాఫీ విషయంలో చంద్రబాబు వాస్తవాలు వక్రీకరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. ఆత్మవంచన మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. వాస్తవవిరుద్ధ ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
రుణమాఫీ చేయకుండా చంద్రబాబు హామీలు మాఫీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిర్వాకంతో లక్షలాది మంది రైతులు పంటబీమా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగంలో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.