తెలంగాణ, ఏపీకి చెందిన వారు ప్రజలు 2015 డిసెంబర్ నెలాఖరు వరకు ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్నా కార్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీకి చెందిన వారు ప్రజలు 2015 డిసెంబర్ నెలాఖరు వరకు ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్నా కార్డు అందని వారు తిరిగి నమోదు చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. అలాగే ఐదేళ్లలోపు ఆధార్ పొందిన పిల్లలు ఐదేళ్లు దాటితే బయోమెట్రిక్ వివరాలను తాజాగా పొందుపరచాల్సి ఉంటుందని యూఐడీఏఐ డెరైక్టర్ జనరల్ ఎంవీఎస్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణలోని పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పిల్లల పేర్లు నమోదు చేసుకునేందుకు సమీపంలోని స్కూళ్లు, అంగన్‌వాడీలను సంప్రదించాలని, ఈ సేవలన్నీ పూర్తి ఉచితమని పేర్కొన్నారు.