సాక్షి, తాడేపల్లి: రైతులకు సంక్రాంతి కానుకగా ‘రైతు భరోసా’ అందచేస్తామని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, గత సంవత్సరం తరహాలో 2020ని కూడా రైతు నామ సంవత్సరంగా కొనసాగిస్తామన్నారు. సీఎం జగన్ ఉన్నారనే ధీమా రైతుల్లో నెలకొందని ఆయన అన్నారు. ఎంవీఎస్ నాగిరెడ్డి బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ .... ‘ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అందించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా కౌలు రైతులకు రైతు భరోసా అందచేశారు. వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన పీఎం కిసాన్ రైతు భరోసా ఒక ఏడాది ముందు నుంచే ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.2వేలు త్వరలో పడుతుంది. సీఎం జగన్ మొత్తం బడ్జెట్‌లో 12.66 శాతం నిధులు వ్యవసాయానికే కేటాయించారు. పగటిపూట రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నాం’ అని తెలిపారు.
రైతులకు ఉచితంగా పంటల బీమా చెల్లించారు. పశువులకు ఉచితంగా పశుబీమా అందించారు. చంద్రబాబు రుణమాఫీ, ఉచిత విద్యుత్ హామీలను నిలబెట్టుకోలేదు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నాం. చనిపోయిన రైతులను చంద్రబాబు పట్టించుకోలేదు. రైతుల కోసం ముఖ్యమంత్రి జగన్ ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు కేటాయించారు. ఇన్‌పుట్ సబ్సిడీని 15 శాతం పెంచారు.
ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధర రూ.1.50 పైసలకే అందిస్తున్నారు. వరదలు మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. పంటలకు సున్నా వడ్డీకే రుణాలు, పప్పు, చిరు ధాన్యాలకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాము. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను రైతులకు... ఆయన తనయుడు వైఎస్ జగన్ అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 90 శాతం ఎన్నికల హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment