కరువుతాండవిస్తుంటే..అబద్దాలు చెప్పించారు | MVS Nagi Reddy Slams Chandrababu Over Copying Schemes | Sakshi
Sakshi News home page

ఏపీలో కరువుతాండవిస్తుంటే..అబద్దాలు చెప్పించారు

Published Thu, Jan 31 2019 2:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం చం‍ద్రబాబు నాయుడు కొత్త డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ ఇంకా పూర్తిగా చేయలేదని.. ఇన్‌పుట్‌ సబ్సిడీలు కూడా చెల్లించలేదని ఆరోపించారు. లక్షలాది ఎకరాల్లో సాగు తగ్గిందని వివరించారు. రైతు దంపతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నెలకొన్న పరిస్థితుల్లో.. గవర్నర్‌ ప్రసంగంలో రైతు ఆత్మహత్యలు లేవని చెప్పడం దారుణమన్నారు.  రైతు కంట కన్నీరు మంచిది కాదని చంద్రబాబుకు నాగిరెడ్డి సూచించారు.  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement