
'చంద్రబాబు కరడుగట్టిన రైతు వ్యతిరేకి'
ఆంధ్రప్రదేశ్ రైతాంగం పూర్తి సంక్షోభంలో ఉందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతాంగం పూర్తి సంక్షోభంలో ఉందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
ఒక్క అనంతపురం జిల్లాలోనే 60 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. రైతు ఆత్మహత్యలకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు కరడుగట్టిన రైతు వ్యతిరేకిలా మారారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు.