
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి సవాల్ చేశారు. బహిరంగ చర్చకు తమ పార్టీ నుంచి ఇద్దరు నేతలు వస్తారని, టీడీపీ నుంచి కూడా ఇద్దరిని పంపాలని సూచించారు. పోలవరంపై చంద్రబాబు మాత్రమే సమాధానం చెప్పాలికానీ ఆయన తాబేదారులు కాదన్నారు. నాగిరెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు డిమాండ్ మేరకు ప్రాజెక్టుల వద్దే బహిరంగ చర్చ నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజలు, ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. శాశ్వతంగా నిలిచి పోయే ప్రాజెక్టు పనులను చంద్రబాబు నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరాన్ని దోపిడీ ప్రాజెక్టుగా మార్చేశారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment