సాక్షి, అమరావతి: కరోనా వైరస్ (కోవిడ్-19) నివారణ కోసం పలు రంగాలకు చెందిన ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహాయ నిధికి విరాళం ఇస్తున్నానని ఆయన చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వానికి మద్దతుగా చేపట్టిన చర్య కాదని, ప్రజల్ని రక్షించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామిని కావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం.. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు, ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. సంక్షోభ నివారణలో ప్రజలంతా కూడా భాగస్వాములవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పెర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment