one lakh donation
-
కరోనా: ఏపీ సీఎం రిలీఫ్ పండ్‌కు రూ. లక్ష విరాళం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ (కోవిడ్-19) నివారణ కోసం పలు రంగాలకు చెందిన ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయ నిధికి విరాళం ఇస్తున్నానని ఆయన చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వానికి మద్దతుగా చేపట్టిన చర్య కాదని, ప్రజల్ని రక్షించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామిని కావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం.. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు, ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. సంక్షోభ నివారణలో ప్రజలంతా కూడా భాగస్వాములవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పెర్కొన్నారు. -
సత్యదేవుని నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి కాకినాడ రూరల్ మండలం రాయుడు పాలెం గ్రామానికి చెందిన ఆకుల రామచంద్రరావు రూ.లక్ష విరాళాన్ని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా ముక్కోటి ఏకాదశి నాడు ఆకుల రామన్న, సూరేకాంతం, న ర్సింహరావు, కృష్ణకుమారి పేర్ల మీదుగా భక్తులకు అన్నదానం చేయమని కోరినట్టు అధికారులు తెలిపారు. దేవాదాయశాఖ డీసీగా రమేష్‌బాబు బోట్‌క్లబ్(కాకినాడ) : దేవాదాయశాఖ డీసీగా(ఎఫ్ఏసీ) రాజమండ్రి ఎసీ డీఎల్వీ రమేష్‌బాబును నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీగా పని చేసిన చందు హనుమంతరావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రమేష్‌బాబును నియమించారు. రమేష్‌బాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. -
సెక్స్‌వర్కర్ల విరాళం.. లక్ష!
కడుపు నింపుకోడానికి పడుపు వృత్తి చేస్తున్నా.. తమకూ మనసుందని, అది కూడా స్పందిస్తుందని నిరూపించారు మహారాష్ట్రలోని సెక్స్‌వర్కర్లు. చెన్నై వరద బాధితులను ఆదుకోడానికి తమవంతు సాయంగా.. లక్ష రూపాయలు పంపారు. తాము రోజుకు ఒకపూటే తింటున్నా.. రూపాయి రూపాయి కూడబెట్టి మరీ ఈ సొమ్మును పంపారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో స్నేహాలయ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అనిల్ కవాడేకు వాళ్లు అందించారు. చెన్నై వరద పరిస్థితి గురించి తెలిసినప్పటి నుంచి వీళ్లకు కంటిమీద కునుకు లేదని.. దాంతో ఎలాగోలా వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకుని తమవంతుగా ఈ సొమ్ము సమకూర్చారని స్నేహాలయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి చెప్పారు. జిల్లాలో మొత్తం సుమారు 3 వేల మంది వరకు సెక్స్ వర్కర్లు ఉండగా, వాళ్లలో 2వేల మంది ఈ విరాళాలు ఇచ్చారు.