సెక్స్‌వర్కర్ల విరాళం.. లక్ష! | sex workers donated 1 lakh rupees for Chennai relief fund | Sakshi
Sakshi News home page

సెక్స్‌వర్కర్ల విరాళం.. లక్ష!

Published Tue, Dec 8 2015 3:46 PM | Last Updated on Mon, Oct 8 2018 6:08 PM

సెక్స్‌వర్కర్ల విరాళం.. లక్ష! - Sakshi

సెక్స్‌వర్కర్ల విరాళం.. లక్ష!

కడుపు నింపుకోడానికి పడుపు వృత్తి చేస్తున్నా.. తమకూ మనసుందని, అది కూడా స్పందిస్తుందని నిరూపించారు మహారాష్ట్రలోని సెక్స్‌వర్కర్లు. చెన్నై వరద బాధితులను ఆదుకోడానికి తమవంతు సాయంగా.. లక్ష రూపాయలు పంపారు. తాము రోజుకు ఒకపూటే తింటున్నా.. రూపాయి రూపాయి కూడబెట్టి మరీ ఈ సొమ్మును పంపారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో స్నేహాలయ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అనిల్ కవాడేకు వాళ్లు అందించారు.

చెన్నై వరద పరిస్థితి గురించి తెలిసినప్పటి నుంచి వీళ్లకు కంటిమీద కునుకు లేదని.. దాంతో ఎలాగోలా వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకుని తమవంతుగా ఈ సొమ్ము సమకూర్చారని స్నేహాలయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి చెప్పారు. జిల్లాలో మొత్తం సుమారు 3 వేల మంది వరకు సెక్స్ వర్కర్లు ఉండగా, వాళ్లలో 2వేల మంది ఈ విరాళాలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement