
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగంలో లేని అభివృద్ధిని చూపిస్తూ సీఎం చంద్రబాబు గొప్పలు చెబుతుండడంతో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. ఒకవైపు మునుపటికన్నా సాగుభూమి విస్తీర్ణం తగ్గుతూ పోతూంటే, రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని ఉంటే అసలు అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయరంగం బాగా ఉండేదని, చంద్రబాబు పాలనలో రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment