ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
సాక్షి, అమరావతి: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బడ్జెట్లో చెబుతారు కానీ, ఎలా చేస్తారో స్పష్టత ఉండదంటూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు పెద్ద పీట ఎక్కడ వేశారో అర్ధం కావటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. 2019-20లో సబ్సిడీలకు రూ. 3,38,153.67 కోట్లు కేటాయించి రూ. 2,63,557.33 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2020-21కి ఆహార, ఎరువుల సబ్సిడీలు తగ్గించి రూ. 2,62,108.76 కోట్లు మాత్రమే కేటాయించి, అత్యధికంగా దృష్టి పెట్టవలసిన వ్యవసాయ యాంత్రీకరణ మీద దృష్టి పెట్టకుండా విధానపరమైన కేటాయింపులు పెంచకుండా ‘కిసాన్ రైలు’ వేస్తామని చెప్పారన్నారు. దేశవ్యాప్తంగా 26 లక్షల సొలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పడమే వ్యవసాయానికి పెద్దపీట వెయ్యడమా అని ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్)
Comments
Please login to add a commentAdd a comment