
రైతులకు క్షమాపణ చెప్పండి: నాగిరెడ్డి డిమాండ్
పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.
హైదరాబాద్: పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. వ్యవసాయ రుణాలు, పంటరుణాలు తేడా తెలియదా అని ప్రశ్నించారు. పొంతనలేకుండా మాట్లాడుతూ రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు తీరుతో రైతులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి, రైతులకు క్షమాపణ చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.