సాక్షి, అమరావతి: బడ్జెట్‌లో వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని ఏపీ వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మేలు చేసేలా సంకల్ప బలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. ప్రకృతి కూడా సహకరించి గత పది సంవత్సరాల్లో లేని విధంగా ఆహార ధాన్యాలు దిగుబడి గత ఏడాది కంటే పెరిగాయని పేర్కొన్నారు. ఉత్పత్తులు పెరగడమే కాదని.. సరాసరి దిగుబడులు కూడా పెరిగాయని తెలిపారు.
కరోనా సంక్షోభం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది ఆదాయం పెరిగే అవకాశం లేనందున, మొత్తం బడ్జెట్ గత ఏడాది కంటే 1.4 శాతం తగ్గిందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2,24,789.18 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని.. అందులో వ్యవసాయానికి 29,159.97 కోట్లు కేటాయించారన్నారు. రెండో సంవత్సరం కూడా రెండంకెల శాతం వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment