ఇందుకూరుపేట(నెల్లూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసమే రాష్ట్ర ప్రజలు బయటకు వెళుతున్నారు తప్ప, బతకడానికి పనుల కోసం వలసలు వెళ్లేవారు లేరని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మండలంలోని రాముడుపాళెం వచ్చారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు బెంగళూరు, కేరళ, చెన్నై వంటి ప్రాంతాలకు దినసరి కార్మికులుగా వలసలు పోయారని వాపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో 38 లక్షల పింఛన్లు ఉండగా ప్రస్తుతం 62.70 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారన్నారు.
సీఎం చెప్పిన విధంగా ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలను నెరవేరుస్తున్నారన్నారు. రైతాంగానికి మరింత పెద్ద పీట వేశారని చెప్పారు. ప్రతి ఏటా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని, వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, పునర్ నిర్మా ణం చేస్తున్నారన్నారు. గతంలో ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్‌ను రూ.2లకు ఇవ్వాలని అప్పటి ఎంపీ రాజమోహన్‌రెడ్డితో కలిసి మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో వినతిపత్రం అందించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్‌ను రూ.1.50లకే ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. మూడేళ్లలో ఆక్వా రంగానికి రూ.2,400 కోట్ల ఇచ్చారన్నారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్‌కు సుమారు రూ.6.50 ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగనన్న కాలనీల్లో 30 లక్షల నివాసాలకు ఇళ్ల పట్టాలు ఇస్తే ఎలాంటి అసమానతలకు తావులేకుండా చేశారని నాగిరెడ్డి కొనియాడారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కైలా సం ఆదిశేషారెడ్డి, రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి, పెనుబల్లి హనుమంతరావు నాయుడు, గూడూరు ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, షబ్బీర్, కైలాసం శ్రీనివాసులురెడ్డి, పంబాల జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment