కనీస గిట్టుబాటు ధరతో రైతులకు భద్రత కలుగుతుందని ఏపీ వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. సోమవారం విజయవాడ గేట్ వే హోటల్‌లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వరరావు, కేశినేని నాని తో పాటు మొత్తం 11 మంది ఎంపీలు హాజరయ్యారు.