
సాక్షి, తాడేపల్లి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాసిన లేఖ నిరాధారితంగా ఉందని వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయించిన ధర ఎంతో కూడా తెలియకుండా కన్నా లేఖ రాశారని అన్నారు. సోమవారం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. కావాలని బురదజల్లేందుకు ప్రయత్నించడం మంచిది కాదు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటల కొనుగోలులో కేంద్రం సహకారం అందించేలా ప్రయత్నించాల్సిన వ్యక్తులు ఇలా విమర్శలకు దిగడం సరికాదు. ( కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? )
టీడీపీ నేతలు చేసినట్లు ఆరోపణలు చేయవద్దు.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఇప్పటికే ఆదుకుంటోంది. మీకు చేతనైతే కేంద్రంతో మాట్లాడి ఓ లక్ష టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేలా ప్రయత్నించండి. కేంద్రం, రాష్ట్రం వేరు కాదు.. ఈ విపత్కర సమయంలో అందరం కలిసి పనిచేస్తున్నామని గుర్తించండ’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment