ఎంవీఎస్ నాగిరెడ్డి
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత ప్రకటనలతో రైతులను నిలువునా ముంచివేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ఒక్క రైతు రుణమైనా పూర్తిగా మాఫీ అయిందా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీ రైతాంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
తిరుపతి వెంకన్న సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు అడుతున్నారన్నారు. రుణమాఫీ అన్న బాబు ఇప్పుడు రుణవిముక్తిడ్ని చేస్తానని మాట మార్చారని విమర్శించారు. రైతులను చంద్రబాబు డిఫాల్టర్లను చేశారన్నారు.
**