విజయవాడ: గత కొంతకాలంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపనల పేరుతో చేస్తున్న హడావిడి అంతా ప్రజలను వంచించడానికేనని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. గతంలో కూడా చంద్రబాబు ఇలాగే హడావిడి చేశారనే సంగతిని ఆయన గుర్తు చేశారు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న కారణంగానే చంద్రబాబు తెగ హైరానా పడిపోతున్నారని విమర్శించారు. కర్నూల్ జిల్లాలో శంకుస్థాపన చేసిన నాలుగు ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవని ఈ సందర్భంగా నాగిరెడ్డి పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం పెడితే అవి ఆగిపోతాయన్నారు. ప్రజలనుఏ మభ్యపెట్టడానికే చంద్రబాబు హడావిడి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుందని, రైతాంగం అంతా సంక్షోభంలో ఉందన్నారు. అన్నపూర్ణలాంటి రాష్ట్రం చంద్రబాబు పాలనలో దుర్భిక్షంగా మారిందన్నారు. ఇంతటి దుర్భిక పాలనా అంటూ నాగిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఇంతటి దుర్మార్గపు పాలన చూడలేన్నాడు. 2018 నాటికి పూర్తి చేస్తామన్న పోలవరం హామీ ఏమైంది.. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. చంద్రబాబు పాలనపై రైతులు అంతా ఒక్కసారి ఆలోచించుకోవాలని నాగిరెడ్డి విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment