సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ సంక్షోభం సమయంలో వైఎస్సార్ సీపీ, స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తుంటే.. టీడీపీ ఎక్కడైనా సహాయక కార్యక్రమాలు చేసిందా అని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై టీడీపీ వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వ్యక్తులకు ఎవరికైనా కరోనా వస్తే ఒక్క రూపాయి కూడా వాళ్లు ఖర్చు చేయకుండా అంతా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందుతున్నాయని చెప్పారు.
11 లక్షల టన్నుల ప్రత్తి కొనుగోలు చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. లక్ష క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేశామని, గత ప్రభుత్వం 3 వేల క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. ఏపీ నుంచి 35-40 కంటైనర్ల చేపలు చైనాకు ఎగుమతి అవుతున్నాయని, మదనపల్లి టమాటా మార్కెట్‌లో ప్రభుత్వమే టమాటాను కొనుగోలు చేస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment