
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలేవీ లేవని, అయినా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు తెలిపారు. తనను కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని కోరారు.
విద్యా సంస్థలకు సెలవు పొడిగించాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని సీఎం వైఎస్ జగన్‌ను లోకేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు.