ఇచ్చిన మాటకు ఒక్కసారైనా కట్టుబడి పోలవరం పూర్తయిన తరు వాతనే సీఎం చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రోజుకో మాట మాట్లాడుతు న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.