
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఎత్తివేయడం వలన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం యధాతధంగా జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసే మంచి పనిని అడ్డుకోవాలని ఎన్నికల సంఘం భావించదన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం వలన రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుందన్నారు. కాగా ఎన్నికలను వాయిదా వేసే ముందు విధిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనే విషయం ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గుర్తుచేసిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment