చంద్రబాబుకు బిగ్‌ షాక్‌.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే? | Irregularities In Chandrababu Government: What Actually Happened | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు బిగ్‌ షాక్‌.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే?

Published Wed, May 3 2023 3:51 PM | Last Updated on Wed, May 3 2023 4:00 PM

Irregularities In Chandrababu Government: What Actually Happened - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై సిట్‌ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.  అసలు ఈ కేసులో మొదట నుంచీ ఏం జరిగిందో ఒకసారి పరిశీలిస్తే..

చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం
2019 జూన్‌ 26న కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలపై తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు
విధానపరమైన లోపాలు, న్యాయపరమైన తప్పిదాలు, ఆర్థిక అక్రమాలు, మోసపూరిత లావాదేవీలను గుర్తించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ
సీఆర్డీయే సహా పలు ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ
డిసెంబర్‌ 27, 2019న తొలినివేదిక ఇచ్చిన కేబినెట్‌ సబ్‌ కమిటీ
చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక

కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదికపై తదుపరి రాష్ట్ర అసెంబ్లీలో చర్చ. కేబినెట్‌ సబ్‌ కమిటీ గుర్తించిన అంశాలపై చర్చ
దీనిపై దర్యాప్తు జరిపించాలని ఆదేశించిన స్పీకర్‌. సిట్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం
ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 21, 2020లో సిట్‌ ఏర్పాటు
10 మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సిట్‌ గుర్తించిన అంశాలపై దర్యాప్తు చేసి కేసులు రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేసే అధికారాన్ని సిట్‌కు అప్పగించిన ప్రభుత్వం
అవసరమైన పక్షంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమాచారాన్ని పంచుకోవడం, దర్యాప్తులో వారితో సమన్వయం చేసుకోవాలని సిట్‌కు నిర్దేశించిన ప్రభుత్వం
ఎరినైనా విచారణ చేయడానికి, సీఆర్పీసీ ప్రకారం వారి స్టేట్‌మెంట్లను నమోదు చేయడానికి సిట్‌కు అధికారం
దర్యాప్తునలో ఏ అంశానికైనా సంబంధించి ఏ రికాక్డునైనా పరిశీలించే అధికారం సిట్‌కు ఉంది

కోర్టుకెక్కిన టీడీపీ:
సిట్ ఏర్పాటును, దర్యాప్తును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించిన తెలుగు దేశం పార్టీ. టీడీపీ నాయకులు వర్లరామయ్య, ఆలపాంటి రాజేంద్ర ప్రసాద్‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు
తమ పార్టీ ప్రయోజనాలకోసమే పిటిషన్లు దాఖలు చేశామని వెల్లడించిన వర్ల రామయ్య
మార్చి 4, 2020న హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ జనరల్‌ సెక్రటరీ వర్ల రామయ్య
మార్చి 10న మరో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన వర్ల రామయ్య జీవోలను పక్కనపెట్టాలని పిటిషన్‌దాఖలు
మార్చి 23, 2020న  కేంద్ర ప్రభుత్వానికి లేఖ. అమరావతి వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ

అప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇలా:
సెప్టెంబరు 16, 2020న ఈకేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు. అంతకుముందు మీడియాలో వార్తలు కూడా ప్రసారం చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు. 
అమరావతి ప్రాంతంలో ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారో… వివరాలను కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం
సీబీఐ దర్యాప్తునకు రాసిన లేఖనూ కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం
ఈడీ ఈసీఐఆర్‌ నమోదుచేసిన విషయాన్నీ కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం
ఈ కారణంగా - కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను ప్రతివాదులుగా చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థననూ తోసిపుచ్చిన కోర్టు
ప్రత్యేక కోర్టు ఏర్పాటు లాంటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను కొట్టిపారేసిన జస్టిస్‌ డీవీ సోమయాజులు
గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్న హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వం అధికారాల ప్రయోగానికి పరిమితులు ఉన్నాయన్న హైకోర్టు
గత ప్రభుత్వ విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, నిర్దిష్టమైన, బలమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే పక్కకు తప్పుకోవాలన్న కోర్టు
గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించాలంటే శాసనపరమైన అధికారం ఉండాలే తప్ప, స్వతఃసిద్ధ అధికారాలు లేవన్న హైకోర్టు
ప్రభుత్వానికి ఇలాంటి అధికారులు కట్టబెడుతూ ఎలాంటి చట్టం లేదన్న కోర్టు

ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే..?
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ప్రభుత్వం 
దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదన
ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని విచారణ సందర్భంగా  ప్రశ్నించిన సుప్రీంకోర్టు 

గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని విచారణ సమయంలో  వ్యాఖ్యానించిన సుప్రీం
సిట్ నియామకంపై  హై కోర్ట్ ఇచ్చిన  స్టే ను కొట్టి వేసిన సుప్రీం కోర్టు
ఆదేశాలు ఇచ్చిన జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్‌ ధర్మాసనం
చంద్రబాబు ప్రభుత్వం లోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు
సిబిఐ , ఈడీ దర్యాప్తుకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో  స్టే అవసరం లేదు
సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదు
జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదన్న సుప్రీం
పిటిషన్ ను తాజాగా విచారించే సమయంలో , ఈ కేసును సిబిఐ, ఈడీకి పంపుతామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను హై కోర్ట్ పరిగణలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు.
చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement