
వైఎస్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి
రైతులకు చట్టబద్దంగా చెల్లించాల్సిన పరిహారం కూడా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): అన్నదాతను బాధపెట్టిన ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాక్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులను వంచిస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు రైతులను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో 25 లక్షల హెక్టార్లలో పంటలు పాడయ్యాయని తెలిపారు.
రైతులకు చట్టబద్దంగా చెల్లించాల్సిన పరిహారం కూడా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జీరో బడ్జెట్ వ్యవసాయం గురించి మాట్లాడటం దారుణమన్నారు. రైతుల కోసం ఆమరణ దీక్ష చేపట్టిన జక్కంపూడి రాజాను బలవంతంగా తరలించారని పేర్కొన్నారు. ఆరు జిల్లాలో 322 మండలాలు కరవుతో అల్లాడుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యమన్నారు.