
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వైఎస్సార్‌సీపీలో విషాదం చోటు చేసుకుంది. సిటీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఫ్రూటీకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆయన గత కొంతకాలంగా విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం సీఎం జగన్.. కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి చంద్రకళా దీప్తికి ఫోన్ చేసి ఆరా తీశారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి ఫ్రూటీ కుమార్ పార్టీకి ఎనలేని కృషి చేశారు. ఆయన మరణం పట్ల పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ధర్మాన్న కృష్ణదాస్ సంతాపం..
శ్రీకాకుళం: కాకినాడ నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఫ్రూటి కుమార్ మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో అకాల మరణం బాధిస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment