Kakinada City
-
మద్యం మత్తులో మిత్రుల వివాదం.. గాజుసీసా ముక్కతో..
కాకినాడ సిటీ: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఓ చిన్న వివాదం ఒకరి దారుణ హత్యకు దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. పాలెపు కాసుబాబు (26), రవి కాసు, విఘ్నేష్, సతీష్‌లది కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం. ఈ నలుగురూ ఫొటోగ్రఫీ కోర్సు చేశారు. కాకినాడ శాంతినగర్‌లోని మదర్ థెరిసా విగ్రహం సమీపాన ఆరు నెలల క్రితం ‘స్టోరీస్’ అనే పేరుతో స్టూడియో పెట్టారు. జగన్నాథపురం మహిళా కళాశాల సమీపాన రూము తీసుకొని నలుగురూ అద్దెకు ఉంటున్నారు. నలుగురూ కలిసి మద్యం తాగేందుకు విఘ్నేష్ స్థానిక ఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో 306 నంబర్ రూమును బుధవారం రాత్రి బుక్ చేశాడు. అక్కడ కాసుబాబు, రవి కాసు, విఘ్నేష్, సతీష్‌తో పాటు రామకృష్ణ, బిర్లా అనే మరో ఇద్దరు కలిసి రాత్రి మద్యం తాగారు. మద్యం తాగుతున్న సమయంలో రవి కాసు చెంపపై కాసుబాబు సరదాగా కొట్టాడు. ఆ తరువాత సరదాగా కొట్టానని క్షమాపణ చెప్పాడు. అయితే కాసుబాబు తనను కొట్టిన విషయాన్ని రవి కాసు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పోస్టు చేశాడు. విషయాన్ని అక్కడితో వదిలేసినట్లు నటించి, మద్యం తాగిన అనంతరం రామకృష్ణ, బిర్లాను తీసుకొని రాత్రి 12 గంటల సమయంలో రవి కాసు బయటకు వెళ్లిపోయాడు. కాసుబాబు, సతీష్ హోటల్ రూములోనే ఉండిపోయారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రవి కాసు తిరిగి హోటల్ రూముకు వచ్చాడు. తనను కొట్టి అవమానించినట్టు భావించిన అతడు రూముకు వచ్చిన వెంటనే బీరు బాటిల్‌తో కాసుబాబు తలపై బలంగా కొట్టాడు. అనంతరం పగిలిన గాజుసీసా ముక్కతో కాసుబాబు కంఠంలో పొడిచాడు. చదవండి: (ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..) ఈ హడావుడితో సతీష్ నిద్ర లేచాడు. అడ్డం వస్తే అతడిని కూడా చంపేస్తామని రవి కాసు బెదిరించాడు. దీంతో అతడు ప్రాణభయంతో పారిపోయాడు. రవి కాసు చేసిన దాడిలో కాసుబాబు అక్కడికక్కడే చనిపోయాడు. హత్య అనంతరం రవి కాసు పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. హతుడు కాసుబాబు సోదరుడు ధనవర్మ ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై టూటౌన్ సీఐ రామచంద్రరావు పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాసుబాబు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉలిక్కిపడిన పల్లం కాట్రేనికోన: కాసుబాబు హత్యతో అతడి స్వస్థలం పల్లం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన పాలెపు ధర్మారావు దంపతులకు హతుడు కాసుబాబుతో పాటు కుమార్తె, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్లు కావడంలో స్నేహితుడు కాసుబాబు, మల్లాడి రవి కలిసి కాకినాడలో స్టూడియో నిర్వహిస్తున్నారు. కాసుబాబు ప్రేమించిన అమ్మాయితో రవి వాట్సాప్ చాటింగ్ చేస్తుండటంతోనే వారి మధ్య వివాదం తలెత్తి, ఈ హత్యకు దారి తీసిందని పలువురు అంటున్నారు. కాసుబాబు మృతదేహాన్ని చూసేందుకు పల్లం రామాలయం సెంటర్‌కు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. -
ఎమ్మెల్యే పేరుతో నకిలీ ఫేస్బుక్.. డబ్బులు పంపాలంటూ
సాక్షి, కాకినాడ : కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరుతో ఓ నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయింది. ఎమ్మెల్యే పేరు, ఆయన ఫొటో వాడి సొమ్ములు గూగుల్‌పే చేయాలంటూ ఓ వ్యక్తి ద్వారంపూడి సన్నిహితులు, అభిమానులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే ద్వారంపూడి పేరుతో సోమవారం ఓ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఎమ్మెల్యే ఫొటో, ఆయన పేరుతోనే అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఓపెన్ చేశాడు. మరికొద్ది సేపటికే తనకు డబ్బులు కావాలని గూగుల్‌పే ఉంటే చేయాలని పోస్టింగ్‌లు పెట్టాడు. సొమ్ము తిరిగి మరుసటి రోజు ఇచ్చేస్తానంటూ పోస్టులు కొనసాగించాడు. ఈ విషయాన్ని కొంతమంది ద్వారంపూడి అనుచరులు గుర్తించి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఈ సమాచారాన్ని ఎస్పీ నయీం అస్మి, ఇతర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సదరు ఫేస్బుక్ అకౌంట్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీన్ షాట్లను తీసి ఎమ్మెల్యే పేరుతో పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ముమ్మిడి పవన్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు మోసపోవద్దు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను చూసి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు సూచించారు. అటువంటి వ్యక్తులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సొమ్ములు పంపాలంటూ పెట్టిన పోస్టింగులు -
కాకినాడ వైఎస్సార్సీపీలో విషాదం
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వైఎస్సార్సీపీలో విషాదం చోటు చేసుకుంది. సిటీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటీకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆయన గత కొంతకాలంగా విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం సీఎం జగన్.. కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి చంద్రకళా దీప్తికి ఫోన్ చేసి ఆరా తీశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఫ్రూటీ కుమార్ పార్టీకి ఎనలేని కృషి చేశారు. ఆయన మరణం పట్ల పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ధర్మాన్న కృష్ణదాస్ సంతాపం.. శ్రీకాకుళం: కాకినాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటి కుమార్ మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో అకాల మరణం బాధిస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కాకినాడలో యువతిపై గ్యాంగ్ రేప్
కాకినాడ క్రైం: కాకినాడ రాగంపేటకు చెందిన 19 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారంటూ యువతి తల్లిదండ్రులు సోమవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ రాగంపేటకు చెందిన యువతిపై అదే ప్రాంతానికి చెందిన దలాయి శ్యామ్‌కుమార్, బొబ్బిలి పృథ్వి, ఎన్.సాయికుమార్, ఈ సాయి అనే యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో త్రీటౌన్ ఇన్చార్జి సీఐ రామ్మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నలుగురు ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. -
ఈ ఎన్నికల ఫలితాలు మాకు టెన్షన్ ఫ్రీ...
సాక్షి, కాకినాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ఫలితాలు తమకు టెన్షన్ ఫ్రీ అని... ప్రజలు వైఎస్సార్ సీపీకే పట్టం కట్టారని గట్టిగా నమ్ముతున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో వైఎస్సార్ సీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అందుకే చంద్రబాబుకే తానూ.. తన కుమారుడు చేసిన అవినీతి మీద వైఎస్ జగన్ విచారణ జరిపిస్తారనే భయం పట్టుకుందన్నారు. కాగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నడిచింది. వైఎస్సార్ సీపీ తరపున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, జనసేన తరపున ముత్తా శశిధర్ మధ్య పోటీ సాగింది. నియోజకవర్గంలో 2,55,716 ఓట్లకుగాను 1,69,754 ఓట్లు పోలయ్యాయి. 66.38 శాతం పోలింగ్ నమోదు అయింది. -
వైఎస్ జగన్ 217వ రోజు పాదయాత్ర షెడ్యూల్
సాక్షి, కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 217వ రోజులో భాగంగా వైఎస్ జగన్ శనివారం ఉదయం కాకినాడ సిటీలోని జేఎన్టీయూ సెంటర్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నాగమల్లి తోట జంక్షన్, సర్పవరం జంక్షన్ మీదుగా ఏపీఐఐసీ కాలనీ వరకు పాదయాత్ర చేస్తారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. లంచ్ క్యాంప్ నుంచి మరలా పాదయాత్ర ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి ఆచంపేట జంక్షన్ వరకు పాదయాత్ర చేసి స్థానిక మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం నైట్ క్యాంపు శిబిరానికి చేరుకుంటారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం 217వ రోజు షెడ్యూల్ విడుదల చేశారు. -
ఈ ప్రశ్నలకేదీ జ‘బాబూ’
చంద్రబాబుకు జిల్లా వాసుల సూటి ప్రశ్న జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి అతీగతీ లేదని ఆవేదన దోమలపై దండయాత్ర సాధ్యమా? నిధుల్లేని పంచాయతీల మాటేమిటీ? ‘‘ఓ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అడగక్కుండానే.. అమలు కానీ ఎన్నో హామీలు జిల్లావాసులకు ఇచ్చారు. ట్రిపుల్ ఐటీ, పెట్రో వర్సిటీ అంటూ ఇలా కొత్త కొత్త ప్రాజెక్టుల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపారు. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఇలా చేశారేంటి ‘‘మహానుబాబా’’!. నిధుల లేమితో పంచాయతీలు కొట్టుమిట్టాడుతుంటే, అరకొర జీతాలతో కార్మికులు అల్లల్లాడుతుంటే..‘‘పారిశుద్ధ్యంపై పోరాటం.. దోమలపై దండయాత్ర’’ అంటున్నారు. కాకినాడలో చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు లేదు కాని.. దోమలపై యుద్ధమా! దానికి మీరు సిద్ధమా? ఇదేం ప్రచార ఆర్భాటం.’’ అంటూ జిల్లావాసులు విస్తుపోతున్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ∙ భానుగుడి(కాకినాడ) : నాలుగు లక్షల జనాభా ఉన్న నగరం. జిల్లా ప్రగతికి ఆయువుపట్టు. కోట్లాది రూపాయల వ్యాపారానికే కాదు. విద్య, వైద్యం, పర్యాటకం అన్నింటికీ కాకినాడ కేంద్రబిందువే. అయితేనేం పాలకుల నిర్లక్ష్యంతో ప్రగతి పథకంలో వెనుకబడింది. అధికార పార్టీ అలసత్వం కారణంగా ఆరు విలువైన ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాకినాడలో ‘దోమలపై దండయాత్ర’కు అమరావతి నుంచి వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు కాకినాడకు మంజూరైన కేంద్ర ప్రాజెక్టులపై పెదవి విప్పాలని ప్రజలు కోరుతున్నారు. తరలిన పెట్రో యునివర్సిటీకి బదులేదీ! 60లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లా, అపార చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని కాదని పెట్రోవర్సిటీని విశాఖపట్నానికి తరలించారు. కేంద్రం ఎంపిక చేసిన ప్రాంతంలో కాకుండా సొంతనిర్ణయంతో ఒక కేంద్ర ప్రాజెక్టును తరలించడం సబబా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని, ఇక్కడి ప్రాంతం పెట్రో ఎడ్యుకేషనల్ హబ్‌గా మారే అవకాశం చేజార్చుకుందని ఆవేదన చెందుతున్నారు. పెట్రోవర్సిటీకి బదులుగా ఒక భారీ కేంద్రస్థాయి ప్రాజెక్టును కాకినాడ నగరానికి అందించి 2014 ఎన్నికల్లో పెట్రోవర్సిటీ ఏర్పాటు చేస్తానన్న హామీని ముఖ్యమంత్రి నిలుపుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మెయి¯ŒS రైల్వే లై¯ŒS ఆధునికీకరణ ఎప్పుడు? కాకినాడ–పిఠాపురం రూ.వందకోట్లతో మెయి¯ŒS రైల్వేలై¯ŒS ఆధునికీకరణ పనులు చేపడుతున్నామంటూ ఏడాది కాలంగా చెప్పుకొస్తున్నారే గానీ పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. దీనికి కేంద్రప్రభుత్వం రూ.50కోట్లు, రాష్ట్రప్రభుత్వం రూ.50కోట్లు ఇవ్వాల్సి ఉంది. స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.కోట్లతో పోర్టు, సిటీ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామంటూ ప్రతీ సమావేశంలో ఊదరగొడుతున్న నేతలు ఆ పనులు పట్టాలెప్పుడు ఎక్కుతాయో చెప్పడం లేదు. పరిశీలన దశలోనే డీజీఎఫ్టీ, ఐఐపీ, ఎ¯ŒSఐఎఫ్‌టీ. విదేశీ వర్తకం కాకినాడ నుంచే నిర్వహించేందుకు డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫార¯ŒS ట్రేడ్(డిజీఎఫ్టీ), ప్యాకేజింగ్ రంగంలో విద్యార్థులకు అవకాశాలు కల్పించడానికి ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్ ఆఫ్ప్యాకేజింగ్(ఐఐపీ), ఫ్యాష¯ŒS రంగంలో ప్రగతికి గాను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష¯ŒS టెక్నాలజీ( ఎ¯ŒSఐఎఫ్‌టీ)లను కాకినాడలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారే గాని ఏళ్లు గడుస్తున్నా పాలకుల ప్రకటనలే గాని పనులు జరగడం లేదు. ట్రిపుల్ ఐటీ ఏది బాబూ! రాష్ట్రవిభజన నేపథ్యంలో 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరుచేసింది. రూ.180 కోట్లతో వంద ఎకరాల్లో తొండంగి మండలంలో దీనిని ఏర్పాటు చేసేందుకు జేఎ¯ŒSటీయూకే క్రీడామైదానంలో అప్పటి కేంద్రమంత్రి పళ్లంరాజు దీనికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అయితే ఇది గడిచి రెండేళ్లయినా దీనిని పట్టించుకున్న నాథుడు లేడు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎంపీ తోట ఒక్కసారైనా పార్లమెంటులో ప్రస్తావించిన దాఖలాలు లేవు. దోమలపై దండయాత్రకు దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ సారైనా ట్రిపుల్ఐటీ గురించి ఏదో ఒక తీపి కబురు చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిధులు లేకుండా నిర్మూలన ఎలా.. బోట్‌క్లబ్(కాకినాడ) : ప్రభుత్వం ప్రచారం కోసం రోజుకో కార్యక్రమం చేపట్టాలని పంచాయతీలపై రుద్దడంతో డబ్బులు లేని మైనర్ పంచాయతీలు నిత్యం అవస్థలు పడుతున్నాయి. ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో నెలల తరబడి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించడంతో ఇది సాధ్యం కాదని అంటున్నారు పంచాయత పాలకవర్గ సభ్యులు, అధికారులు. ప్రతిరోజూ గ్రామాల్లో చెత్త మొత్తం తరలించి డ్రైనేజీల్లో పూడిక తీయాలంటే కనీసం రూ.రెండు వేలకు పైగా ఖర్చవుతుందని, ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా పంచాయతీల్లో నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయని వారంటున్నారు. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 350కిపైగా మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో నిధులకు అంత ఇబ్బందులు లేవు. మిగిలిన 719 పంచాయతీల్లో సగానికి పైగా పంచాయతీల్లో డబ్బులు లేక అవస్థలు పడుతున్నాయి. పారిశుద్ధ్య పనులు చేసేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇంటి పన్నుల మీద వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బందికే సరిపోతోంది. ఇక పారిశుద్ధ్య పనులు చేసే అవుట్సోర్సింగ్ ఇబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వడానికి, కచ్చా డ్రైయిన్లు తవ్వేందుకు, విద్యుత్‌దీపాల నిర్వహణకు డబ్బులు సరిపోని పరిస్థితి ఉంది. ప్రత్యేక డ్రైవ్ తమ వల్ల కాదు ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధా్యనికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రోజూ గ్రామాల్లోని రోడ్డుపై పేరుకుపోయిన చెత్త, చెదారం, డ్రై¯ŒSలోని పూడిక తీత, మంచినీటి పథకాలు శుభ్రం చేయడం, రోడ్లపై బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేయాలని సర్పంచ్‌లు, కార్యదర్శులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉన్న సిబ్బందితో ఈ కార్యక్రమాలు చేయాలంటే కష్టం కావడంతో తాత్కాలిక సిబ్బందిని నియమించి పనులు చేయిస్తున్నారు. వీరికి డబ్బులు ఇచ్చేందుకు సర్పంచ్, కార్యదర్శులు ఏమీ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. దండయాత్రసరే.. డంపింగ్‌యార్డు ఏది? కాకినాడ : మున్సిపాలిటీ నుంచి కార్పొరేష¯ŒSగా అప్‌గ్రేడ్ అవ్వడం, స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడలో డంపింగ్‌యార్డు లేదు. అయితే దోమలపై దండయాత్ర పేరుతో కాకినాడ నగరంలో చేస్తున్న ప్రచార ఆర్భాటాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే దోమలపై దండయాత్ర పేరుతో శనివారం కాకినాడ విచ్చేస్తున్న తీరు చూసి జనం విస్తుపోతున్నారు. అరకొర సిబ్బంది.. దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగిన కాకినాడలో నగరపాలక సంస్థ అధికారుల సమాచారం మేరకు దాదాపు 724 కిలోమీటర్ల మేరకు రహదారులు విస్తరించి ఉన్నట్టు అంచనా. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం కిలోమీటర్‌కు కనీసం ఇద్దరు కార్మికులు చొప్పున అంటే 1448 మంది పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కాకినాడలో 456 మంది రెగ్యులర్, మరో 400 మంది ప్రైవేటు కార్మికులు కలిపి 856 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 14 శానిటరీ సర్కిల్స్ పరిధిలో ఉన్న ఈ అరకొర సిబ్బందితోనే ఇంటింటికీ చెత్త సేకరణ, డ్రైన్లు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, చెత్తను తరలించడం వంటి అన్ని పనులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇదంతా చేస్తే నిత్యం 220 టన్నుల చెత్త ఉత్పత్తవుతుంటే దీనిని తరలించడం మరో పెద్ద సమస్యగా ఏర్పడింది. నగర పరిధిలో ఎక్కడా డంపింగ్‌యార్డు లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు, ఖాళీస్థలాల్లో డంపింగ్ చేస్తూ నెట్టుకొస్తున్నారు. దీంతో నగరంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం, డ్రైన్లు సక్రమంగా శుభ్రం చేయకపోవడం వంటి కారణాలతో దోమల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాగింగ్, యాంటీలార్వా కెమికల్స్ వినియోగంతో కొంత మేరకు ప్రయత్నాలు చేస్తున్నా వాటి వల్ల ప్రజలకు అంతగా ప్రయోజనం కనిపించడంలేదు. కొత్త సిబ్బంది నియామకం లేదని, దాదాపు తేల్చేసిన ప్రభుత్వం 279 జీవో ద్వారా పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డంపింగ్‌యార్డు లేకుండా.. ఉన్న అరకొర సిబ్బందితో సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ చేయకుండా దోమలను ఎలా నియంత్రించగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి ఈ ప్రధాన సమస్యలపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. భూసేకరణ జరగాలి రైల్వే మార్గం నిర్మాణానికి సంబం«ధించి భూసేకరణ జరగాలి. రైల్వే, రెవెన్యు అ«ధికారులు ఈ పనులు వేగంగా నిర్వహించాలి. అటువంటివేమీ లేకుండా ని««దlులు అవిగో..ఇవిగో అని చెప్పడం సమంజసం కాదు. దీనిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని కాకినాడ– పిఠాపురం ప్రధాన రైలు మార్గం పనులు పూర్తిచేయించాలి. – డా.వై.డి.రామారావు ( కాకినాడ రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు) మెరై¯ŒS వర్సిటీ ఏర్పాటు చేయాలి ఏడాదికి 20మిలియ¯ŒS టన్నుల ఎగుమతి, దిగుమతులు జరుగుతూ 2500 మీటర్ల పొడవున్న కాకినాడ సీపోర్టు ప్రాంతంలో ఇప్పటికైనా ఒక మెరై¯ŒS వర్సిటీ లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి మెరై¯ŒS వర్సిటీ ఏర్పాటుకు కృషిచేయాలి. – దూసర్లపూడి రమణరాజు(సామాజిక వేత్త) -
కుప్పకూలిన హాస్టల్ భవనం : విద్యార్థులు సురక్షితం
కాకినాడ : కాకినాడ నగరం సాంబమూర్తినగర్లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలోని హాస్టల్ భవనం కుప్పకూలింది. అయితే భవనంలోని 46 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. విద్యార్థులు స్నానాలు చేస్తున్న సమయంలో భవనం కూలడంలో పెద్ద ప్రమాదం తప్పింది. హాస్టల్ భవనం ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో కూలిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
11 మంది నకిలీ మావోయిస్టులు అరెస్ట్
కాకినాడ: కాకినాడ నగరంలో వ్యాపారులను బెదిరించి దందాలకు పాల్పడుతున్న 11 మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకీలతోపాటు కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారికి పోలీసుస్టేషన్‌కు తరలించి... పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
బీసీ రిజర్వేషన్లపై హామీ ఇస్తేనే మద్దతు
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తెలగ, బలిజ, కాపు వర్గాలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు ఇస్తామని తెలగ, బలిజ, కాపు ఐక్యకార్యాచరణ వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రామ్మోహనరావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కాస్మాపాలిటన్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చి నిజాయతీగా వ్యవహరించాలని పార్టీలను కోరారు. మూడేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయి పోరాటాలు చేసినా నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించలేదని, పైగా ఫైల్‌ను తొక్కిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో 22 శాతం ఉన్న తెలగ, బలిజ, కాపు ఓట్లు కీలకం కాబట్టి అవి చీలిపోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామన్నారు. కాపు, బలిజ వర్గీయులు అధికంగా ఉన్న ప్రాంతాలలో సీట్లకోసం పోరాడతామన్నారు. పార్టీలు టికెట్లు ఇవ్వకపోతే ఆయా ప్రాంతాలలో స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించి సత్తా చూపుతామని హెచ్చరించారు. అనంతరం ఆయన కాపు సద్భావనా సంఘ నాయకులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కాపు సంఘ నాయకులు వీవై దాసు, బసవా ప్రభాకరావు, పెద్దాడ సుబ్బారాయుడు, శ్రీరామ చంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు ఇవ్వాలి పిఠాపురం టౌన్ : తెలగ, బలిజ, కాపులకు జనాభా దామాషా ప్రకారం సీమాంధ్ర ప్రాంతంలో 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లను కేటాయించాలని తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యచరణ వేదిక (టీబీకే జేఏసీ) రాష్ట్ర కన్వీనర్ దాసరి లోవ పిఠాపురంలో బుధవారం జరి గిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం కాపు, తెలగ, బలిజ కులస్తులు కల సికట్టుగా పోరాడాలన్నారు. సమావేశంలో వేదిక ప్రతి నిధులు బాలిపల్లి రాంబాబు, బస్వా శ్రీను, ఎస్.సతీష్, పి.రవికిరణ్, వై.దొరబాబు పాల్గొన్నారు.