-
చంద్రబాబుకు జిల్లా వాసుల సూటి ప్రశ్న
-
జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి అతీగతీ లేదని ఆవేదన
-
దోమలపై దండయాత్ర సాధ్యమా?
-
నిధుల్లేని పంచాయతీల మాటేమిటీ?
‘‘ఓ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అడగక్కుండానే.. అమలు కానీ ఎన్నో హామీలు జిల్లావాసులకు ఇచ్చారు. ట్రిపుల్ ఐటీ, పెట్రో వర్సిటీ అంటూ ఇలా కొత్త కొత్త ప్రాజెక్టుల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపారు. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఇలా చేశారేంటి ‘‘మహానుబాబా’’!. నిధుల లేమితో పంచాయతీలు కొట్టుమిట్టాడుతుంటే, అరకొర జీతాలతో కార్మికులు అల్లల్లాడుతుంటే..‘‘పారిశుద్ధ్యంపై పోరాటం.. దోమలపై దండయాత్ర’’ అంటున్నారు. కాకినాడలో చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు లేదు కాని.. దోమలపై యుద్ధమా! దానికి మీరు సిద్ధమా? ఇదేం ప్రచార ఆర్భాటం.’’ అంటూ జిల్లావాసులు విస్తుపోతున్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
∙
భానుగుడి(కాకినాడ) :
నాలుగు లక్షల జనాభా ఉన్న నగరం. జిల్లా ప్రగతికి ఆయువుపట్టు. కోట్లాది రూపాయల వ్యాపారానికే కాదు. విద్య, వైద్యం, పర్యాటకం అన్నింటికీ కాకినాడ కేంద్రబిందువే. అయితేనేం పాలకుల నిర్లక్ష్యంతో ప్రగతి పథకంలో వెనుకబడింది. అధికార పార్టీ అలసత్వం కారణంగా ఆరు విలువైన ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాకినాడలో ‘దోమలపై దండయాత్ర’కు అమరావతి నుంచి వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు కాకినాడకు మంజూరైన కేంద్ర ప్రాజెక్టులపై పెదవి విప్పాలని ప్రజలు కోరుతున్నారు.
తరలిన పెట్రో యునివర్సిటీకి బదులేదీ!
60లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లా, అపార చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని కాదని పెట్రోవర్సిటీని విశాఖపట్నానికి తరలించారు. కేంద్రం ఎంపిక చేసిన ప్రాంతంలో కాకుండా సొంతనిర్ణయంతో ఒక కేంద్ర ప్రాజెక్టును తరలించడం సబబా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని, ఇక్కడి ప్రాంతం పెట్రో ఎడ్యుకేషనల్ హబ్‌గా మారే అవకాశం చేజార్చుకుందని ఆవేదన చెందుతున్నారు. పెట్రోవర్సిటీకి బదులుగా ఒక భారీ కేంద్రస్థాయి ప్రాజెక్టును కాకినాడ నగరానికి అందించి 2014 ఎన్నికల్లో పెట్రోవర్సిటీ ఏర్పాటు చేస్తానన్న హామీని ముఖ్యమంత్రి నిలుపుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మెయి¯ŒS రైల్వే లై¯ŒS ఆధునికీకరణ ఎప్పుడు?
కాకినాడ–పిఠాపురం రూ.వందకోట్లతో మెయి¯ŒS రైల్వేలై¯ŒS ఆధునికీకరణ పనులు చేపడుతున్నామంటూ ఏడాది కాలంగా చెప్పుకొస్తున్నారే గానీ పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. దీనికి కేంద్రప్రభుత్వం రూ.50కోట్లు, రాష్ట్రప్రభుత్వం రూ.50కోట్లు ఇవ్వాల్సి ఉంది. స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.కోట్లతో పోర్టు, సిటీ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామంటూ ప్రతీ సమావేశంలో ఊదరగొడుతున్న నేతలు ఆ పనులు పట్టాలెప్పుడు ఎక్కుతాయో చెప్పడం లేదు.
పరిశీలన దశలోనే డీజీఎఫ్‌టీ, ఐఐపీ, ఎ¯ŒSఐఎఫ్‌టీ.
విదేశీ వర్తకం కాకినాడ నుంచే నిర్వహించేందుకు డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫార¯ŒS ట్రేడ్(డిజీఎఫ్‌టీ), ప్యాకేజింగ్ రంగంలో విద్యార్థులకు అవకాశాలు కల్పించడానికి ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ప్యాకేజింగ్(ఐఐపీ), ఫ్యాష¯ŒS రంగంలో ప్రగతికి గాను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష¯ŒS టెక్నాలజీ( ఎ¯ŒSఐఎఫ్‌టీ)లను కాకినాడలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారే గాని ఏళ్లు గడుస్తున్నా పాలకుల ప్రకటనలే గాని పనులు జరగడం లేదు.
ట్రిపుల్ ఐటీ ఏది బాబూ!
రాష్ట్రవిభజన నేపథ్యంలో 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరుచేసింది. రూ.180 కోట్లతో వంద ఎకరాల్లో తొండంగి మండలంలో దీనిని ఏర్పాటు చేసేందుకు జేఎ¯ŒSటీయూకే క్రీడామైదానంలో అప్పటి కేంద్రమంత్రి పళ్లంరాజు దీనికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అయితే ఇది గడిచి రెండేళ్లయినా దీనిని పట్టించుకున్న నాథుడు లేడు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎంపీ తోట ఒక్కసారైనా పార్లమెంటులో ప్రస్తావించిన దాఖలాలు లేవు. దోమలపై దండయాత్రకు దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ సారైనా ట్రిపుల్‌ఐటీ గురించి ఏదో ఒక తీపి కబురు చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
నిధులు లేకుండా నిర్మూలన ఎలా..
బోట్‌క్లబ్(కాకినాడ) : ప్రభుత్వం ప్రచారం కోసం రోజుకో కార్యక్రమం చేపట్టాలని పంచాయతీలపై రుద్దడంతో డబ్బులు లేని మైనర్ పంచాయతీలు నిత్యం అవస్థలు పడుతున్నాయి. ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో నెలల తరబడి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించడంతో ఇది సాధ్యం కాదని అంటున్నారు పంచాయత పాలకవర్గ సభ్యులు, అధికారులు. ప్రతిరోజూ గ్రామాల్లో చెత్త మొత్తం తరలించి డ్రైనేజీల్లో పూడిక తీయాలంటే కనీసం రూ.రెండు వేలకు పైగా ఖర్చవుతుందని, ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా పంచాయతీల్లో నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయని వారంటున్నారు.
జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 350కిపైగా మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో నిధులకు అంత ఇబ్బందులు లేవు. మిగిలిన 719 పంచాయతీల్లో సగానికి పైగా పంచాయతీల్లో డబ్బులు లేక అవస్థలు పడుతున్నాయి. పారిశుద్ధ్య పనులు చేసేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇంటి పన్నుల మీద వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బందికే సరిపోతోంది. ఇక పారిశుద్ధ్య పనులు చేసే అవుట్‌సోర్సింగ్ ఇబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వడానికి, కచ్చా డ్రైయిన్లు తవ్వేందుకు, విద్యుత్‌దీపాల నిర్వహణకు డబ్బులు సరిపోని పరిస్థితి ఉంది.
ప్రత్యేక డ్రైవ్ తమ వల్ల కాదు
ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధా్యనికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రోజూ గ్రామాల్లోని రోడ్డుపై పేరుకుపోయిన చెత్త, చెదారం, డ్రై¯ŒSలోని పూడిక తీత, మంచినీటి పథకాలు శుభ్రం చేయడం, రోడ్లపై బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేయాలని సర్పంచ్‌లు, కార్యదర్శులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉన్న సిబ్బందితో ఈ కార్యక్రమాలు చేయాలంటే కష్టం కావడంతో తాత్కాలిక సిబ్బందిని నియమించి పనులు చేయిస్తున్నారు. వీరికి డబ్బులు ఇచ్చేందుకు సర్పంచ్, కార్యదర్శులు ఏమీ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
దండయాత్రసరే.. డంపింగ్‌యార్డు ఏది?
కాకినాడ :
మున్సిపాలిటీ నుంచి కార్పొరేష¯ŒSగా అప్‌గ్రేడ్ అవ్వడం, స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడలో డంపింగ్‌యార్డు లేదు. అయితే దోమలపై దండయాత్ర పేరుతో కాకినాడ నగరంలో చేస్తున్న ప్రచార ఆర్భాటాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే దోమలపై దండయాత్ర పేరుతో శనివారం కాకినాడ విచ్చేస్తున్న తీరు చూసి జనం విస్తుపోతున్నారు.
అరకొర సిబ్బంది..
దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగిన కాకినాడలో నగరపాలక సంస్థ అధికారుల సమాచారం మేరకు దాదాపు 724 కిలోమీటర్ల మేరకు రహదారులు విస్తరించి ఉన్నట్టు అంచనా. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం కిలోమీటర్‌కు కనీసం ఇద్దరు కార్మికులు చొప్పున అంటే 1448 మంది పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కాకినాడలో 456 మంది రెగ్యులర్, మరో 400 మంది ప్రైవేటు కార్మికులు కలిపి 856 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 14 శానిటరీ సర్కిల్స్ పరిధిలో ఉన్న ఈ అరకొర సిబ్బందితోనే ఇంటింటికీ చెత్త సేకరణ, డ్రైన్లు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, చెత్తను తరలించడం వంటి అన్ని పనులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇదంతా చేస్తే నిత్యం 220 టన్నుల చెత్త ఉత్పత్తవుతుంటే దీనిని తరలించడం మరో పెద్ద సమస్యగా ఏర్పడింది. నగర పరిధిలో ఎక్కడా డంపింగ్‌యార్డు లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు, ఖాళీస్థలాల్లో డంపింగ్ చేస్తూ నెట్టుకొస్తున్నారు. దీంతో నగరంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం, డ్రైన్లు సక్రమంగా శుభ్రం చేయకపోవడం వంటి కారణాలతో దోమల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాగింగ్, యాంటీలార్వా కెమికల్స్ వినియోగంతో కొంత మేరకు ప్రయత్నాలు చేస్తున్నా వాటి వల్ల ప్రజలకు అంతగా ప్రయోజనం కనిపించడంలేదు. కొత్త సిబ్బంది నియామకం లేదని, దాదాపు తేల్చేసిన ప్రభుత్వం 279 జీవో ద్వారా పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డంపింగ్‌యార్డు లేకుండా.. ఉన్న అరకొర సిబ్బందితో సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ చేయకుండా దోమలను ఎలా నియంత్రించగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి ఈ ప్రధాన సమస్యలపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
భూసేకరణ జరగాలి
రైల్వే మార్గం నిర్మాణానికి సంబం«ధించి భూసేకరణ జరగాలి. రైల్వే, రెవెన్యు అ«ధికారులు ఈ పనులు వేగంగా నిర్వహించాలి. అటువంటివేమీ లేకుండా ని««దlులు అవిగో..ఇవిగో అని చెప్పడం సమంజసం కాదు. దీనిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని కాకినాడ– పిఠాపురం ప్రధాన రైలు మార్గం పనులు పూర్తిచేయించాలి.
– డా.వై.డి.రామారావు
( కాకినాడ రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు)
మెరై¯ŒS వర్సిటీ ఏర్పాటు చేయాలి
ఏడాదికి 20మిలియ¯ŒS టన్నుల ఎగుమతి, దిగుమతులు జరుగుతూ 2500 మీటర్ల పొడవున్న కాకినాడ సీపోర్టు ప్రాంతంలో ఇప్పటికైనా ఒక మెరై¯ŒS వర్సిటీ లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి మెరై¯ŒS వర్సిటీ ఏర్పాటుకు కృషిచేయాలి.
– దూసర్లపూడి రమణరాజు(సామాజిక వేత్త)