విజయవాడ: వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి పార్టీ కార్యాయలంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ..కదలిక పత్రిక ఎడిటర్ ఇమామ్ రాసిన ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రల్లో పాల్గొన్న వ్యక్తి ఇమామ్ అని, 99 ఆర్టికల్స్ కలిపి ఈ పుస్తకం రూపుదిద్దుకున్నదని తెలిపారు. జలయజ్ఞంతో ఉమ్మడి ఏపీలో కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తానన్న ఏకైక సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ‘ జనం చెక్కిన మనిషి’ అనే పుస్తకం ఇదివరకే రాశారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిపై పుస్తకం రాశారని చెప్పారు. ఈ పుస్తకాన్ని వైఎస్ విజయమ్మకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.
అలాంటి తెగువ జగన్‌లో చూశా: ఇమామ్(కదలిక పత్రిక ఎడిటర్)
ప్రజల కోసం, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కదలిక పత్రిక ఎడిటర్ ఇమామ్ కొనియాడారు. అలాంటి తెగువ వైఎస్ జగన్, షర్మిలలో చూశానన్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల రోజే తాను రాసిన పుస్తకం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
మండేలాలా గుండె ధైర్యం ఉన్న వ్యక్తి జగన్: ఆర్‌సీ రెడ్డి(రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్)
కర్షకుల కోసం కష్టపడే నాగిరెడ్డి ఈ పుస్తకం ఆవిష్కరించడం సంతోషకరమైన విషయమని రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి అన్నారు. సకల సౌకర్యాలు వదిలి తండ్రి బాటలో నడిచి పాదయాత్ర చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. నెల్సన్ మండేలాకు ఉన్నంత గుండె ధైర్యం వైఎస్ జగన్‌కు ఉందన్నారు. చంద్రబాబు బూటకపు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment