కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో మీడియా నియంత్రణపై గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు.
విజయవాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో మీడియా నియంత్రణపై గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు. దాంతో ప్రత్తిపాటి మాట్లాడుతూ.. శాంతి భద్రతల దృష్ట్యా మీడియాను హ్యాండిల్ చేశామంటూ చెప్పుకొచ్చారు.
గతంలో తూర్పుగోదావరి జిల్లా తుని సంఘటనలో చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే కాదా? అని చెప్పారు. మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయనే మీడియాను నియంత్రించామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.