రుణమాఫీ పథకం గడువును ఫిబ్రవరి 7 వరకు పెంచినట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
రుణమాఫీ పథకం గడువును ఫిబ్రవరి 7 వరకు పెంచినట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 40 లక్షల ఖాతాల్లో రూ. 4600 కోట్ల డబ్బు జమ చేశామన్నారు. రెండోదశలో 12 లక్షల ఖాతాలను కంప్యూటరీకరించినట్లు చెప్పారు.
మరో 4 లక్షల ఖాతాలపై అభ్యంతరాలున్నాయని, రెండు మూడు రోజుల్లో వాటిని కూడా పూర్తి చేస్తామని అన్నారు. రైతులంతా బ్యాంకులకు వివరాలు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు నాలుగు సార్లు పొడిగించామని, ఇకమీదట గడువు పొడిగించబోమని మంత్రి స్పష్టం చేశారు. సహకార బ్యాంకుల్లో అవకతవకల కారణంగా రూ. 150 కోట్ల చెల్లింపులు నిలిపివేశామని అన్నారు.