సాక్షి, ముంబై : మహారాష్ట్రలో వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ రైతులు నాసిక్ నుంచి ముంబై వరకూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. 30,000 మందితో మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద ఆందోళన నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. రైతుల ప్రదర్శన ఆదివారానికి ముంబై చేరుకోనుంది. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు విద్యుత్ బిల్లుల మాఫీ, వ్యవసాయ భూముల సేకరణను నిలిపివేయాలనే డిమాండ్లతో రైతులు భారీ ఆందోళనకు శ్రీకారం చుట్టారు.
రుణమాఫీపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మోసగించిందని, గత ఏడాది కాలంలో 1753 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ దావ్లే ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టం వాటిల్లిన రైతులకు సరైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment