'రుణమాఫీపై ఆశలు వదులుకోండి' | farmers meet minister prathipati pulla rao | Sakshi
Sakshi News home page

'రుణమాఫీపై ఆశలు వదులుకోండి'

Published Sat, Nov 21 2015 12:33 PM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM

farmers meet minister prathipati pulla rao

గోరంట్ల: గతంలో రుణమాఫీ అమలు కాని రైతులు ఇక ఆశలు వదులుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శనివారం ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి వెళుతూ అనంతపురం జిల్లా గోరంట్ల మండలం చింతలపల్లి బస్టాండ్ వద్ద ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత వర్షాలకు పంటల నష్టంపై రైతలు ప్రత్తిపాటి దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పంట నష్టాన్ని అంచనావేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రుణమాఫీపై ప్రత్తిపాటి స్పందిస్తూ... గతంలో విడుదల చేసిన మేరకే రుణమాఫీ వర్తిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement